చిరంజీవి, బాలకృష్ణ, సమంత, రానా, నాగార్జున, నాని, జూనియర్ ఎన్టీఆర్... టాలీవుడ్ టాప్ నటీనటులు ఎంతోమంది వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఇదో నయా ట్రెండ్‌లా మారిందిప్పుడు. అందులోనూ  ముఖ్యంగా ఓటీటీల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రస్తుతం బాలయ్య ‘ఆహా’ ఓటీటీలో నిర్వహిస్తున్న ‘అన్ స్టాపబుల్’ షో దిగ్విజయంగా నడుస్తోంది. ఈ షో హిట్ కొట్టాక ఆహా ఓటీటీని మరింత క్రేజీగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధంచేస్తున్నారట ఆహా నిర్వాహకులు. ఇందుకోసం అల్లు అర్జున్‌ను రంగంలోకి దింపబోతున్నారు. ఆయన హోస్ట్‌గా ఆహాలో ఓ టాక్ షో మొదలుపెట్టాలన్న ప్లాన్‌లో ఉన్నట్టు సమాచారం. ఇదే జరిగితే బన్నీ అభిమానులకు పండగే. ఆయన సినిమాల కోసం వేచిఉండాల్సిన అవసరం లేకుండా ప్రతి వారం అతని షోను చూడొచ్చు. అయితే అల్లు అర్జున్ చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. కాబట్టి ఈ టాక్ షో పట్టాలెక్కే వరకు నమ్మలేం. అయితే దీనిపై ఆహా ఒక ప్రకటన చేసే వరకు అల్లు అర్జున్ హోస్ట్ గా చేస్తారో లేదో కూడా కచ్చితంగా చెప్పలేము. ఇంతకుముందు కూడా విక్టరీ వెంకటేష్‌తో ఓ రియాల్టీ షో చేయబోతున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ అవేవీ నిజం కాలేదు. 


పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. హిందీలో ఈ సినిమా బాగా ఆడడంతో పాటూ వసూళ్లు కూడా బాగానే రాబట్టింది. అందుకే ఈ సినిమా క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలని ఆహా నిర్వాహకులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ టాక్ షో కేవలం టాలీవుడ్ సెలెబ్రిటీల కోసం మాత్రమే కాదు, ఇతర పరిశ్రమల వారు పాల్గొంటారని తెలుస్తోంది.  


పుష్ప సినిమా తరువాత అల్లు అర్జున్ తన రెమ్యునరేషన్ కూడా పెంచేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఒక్కోసినిమాకు రూ.75 కోట్ల దాకా డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. త్వరలో లైకా సంస్థతో సినిమా చేసేందుకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఆ సినిమాకు ఇంత పెద్ద మొత్తంలో పారితోషికాన్ని తీసుకుంటున్నట్టు టాక్. 



Also Read: 'ఆర్ఆర్ఆర్' కొత్త రిలీజ్ డేట్... రెండిటిలో ఏదో ఒక రోజున!
Also Read: ప్రేమికుల రోజున మహేష్ అభిమానులకు తమన్ సంగీత కానుక!
Also Read: రవితేజ కెరీర్‌లోనే ఇది తొలిసారి... 'రావణాసుర' కోసం డేరింగ్ స్టెప్!
Also Read: అందుకు ఎనిమిదేళ్లు పట్టింది... కీర్తీ సురేష్‌కు ఈ సినిమా సో స్పెషల్!
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి