Hariteja: నీకు కరోనా పాజిటివ్ రావాలి అన్న నెటిజన్... గట్టిగా ఇచ్చిపడేసిన నటి

హరితేజకు, ఒక నెటిజన్‌కు ఇన్ స్టాగ్రామ్‌లో మాటల యుద్ధం నడిచింది.

Continues below advertisement

యాంకర్‌గా, నటిగా హరితేజ తెలుగు వారికి ఎంతో దగ్గరైంది. ఇన్ స్టాలో తరచూ అభిమానులతో మాట్లాడుతూ ఉంటుంది. తాజాగా ఆమె తన అభిమానులతో ‘క్వశ్చన్ అండ్ ఆన్సర్’ సెషన్ నడిపింది. ఆ సెషన్‌కు కామెడీగా ‘ఇంకేంటి మరి డోలో? సారీ బోలో’అని పేరు పెట్టింది. దానికి ఓ నెటిజన్ చాలా కోపంగా రియాక్ట్ అయ్యాడు. ‘నీకు కరోనా పాజిటివ్ రావాలి’ అని కామెంట్ చేశాడు. దానికి హరితేజ చాలా కూల్ గా ‘మీకు కొంచెం పాజిటివ్ యాటిట్యూడ్ రావాలి... గాడ్ బ్లెస్’ అని తిరిగి రిప్లై ఇచ్చింది. 

Continues below advertisement

ఆ నెటిజన్ అంతటితో వదిలేయకుండా ‘నువ్వు నీ వెధవ ఓవర్ యాక్టింగ్... ఇంత సీరియస్ సిట్యువేషన్లో కూడా నీ పిచ్చి సిల్లీ జోక్స్... తూ’ అంటూ కామెంట్ చేశాడు. దానికి హరితేజ ‘అబ్బో... మస్త్ బీపీ వొస్తాంది సార్ మీకు... సల్ల పడండి జరా, నవ్వుకుంటే అన్ని బాధలు పోతాయని నేను నమ్ముతా అంతే... డోన్ట్ బి సో రూడ్’ అని రిప్లయ్ ఇచ్చింది. దానికి సదరు నెటిజన్ ‘మీరు కరోనా పాజిటివ్ అనిపిస్తుందండి’ అని కామెంట్ చేయగా, హరితేజ ‘ఆహా... సానా హ్యాపీగా ఉంది కదండి మీకు... ఇంకేం అనిపిస్తుంది సార్ మీకు’ అని వెటకారంగా రిప్లయ్ ఇచ్చింది. మిగతా నెటిజన్లు మాత్రం హరితేజకు అండగా నిలిచారు. తన సోషల్ మీడియా పోస్టులతో సానుకూలతను పంచుతోందని మెచ్చుకున్నారు.

హరితేజ గత ఏడాది సెకండ్ వేవ్ సమయంలోనే కరోనా బారిన పడింది. ఆ సమయంలో ఆమె నిండు గర్భిణి. దీంతో ఆమెకు నార్మల్ డెలివరీ చేసేందుకు చాలా వైద్యులు నిరాకరించారు. దీంతో కోవిడ్ ఆసుపత్రుల కోసం చాలా వెతకాల్సి వచ్చింది. చాలా టెస్టులు చేయించుకోవాల్సి వచ్చింది. చివరికి అత్యవసర సిజేరియన్ డెలివరీ చేయవలసి వచ్చింది. ఆ సమయంలో హరితేజకు తోడుగా, ఆమె భర్త మాత్రమే ఉన్నారు. వారిద్దరికీ ప్రసవం అయ్యాక ఎలా ఉండాలి? బిడ్డను ఎలా చూసుకోవాలో అనుభవం లేదు. పుట్టిన బిడ్డకు కరోనా నెగిటివ్ రావడంతో ఆమెను తల్లికి దూరంగా ఉంచారు. హరితేజ తన కూతురిని వీడియో కాల్ లో చూసేది. ఈ బాధాకరమైన అనుభవంపై ఆమె ఒక వీడియో కూడా చేసింది. జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఘటనగా చెప్పుకుంది. 

Also Read: అందుకు ఎనిమిదేళ్లు పట్టింది... కీర్తీ సురేష్‌కు ఈ సినిమా సో స్పెషల్!

Also Read: ఫ్రెండ్స్‌... ఆ ద‌రిద్రాన్ని (కొవిడ్‌ను) సీరియ‌స్‌గా తీసుకోండి! - త‌రుణ్ భాస్క‌ర్‌

Also Read: 'ఆచార్య'కు 'శ్యామ్ సింగరాయ్' నచ్చాడు... మీసం మెలేసిన మెగాస్టార్, నేచురల్ స్టార్!

Also Read: ఔను... వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు! ప్రేమలో సురేఖావాణి కుమార్తె... రానా రూటులో ప్రకటన!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Continues below advertisement
Sponsored Links by Taboola