దర్శకధీరుడు రాజమౌళి లేటెస్ట్ మూవీ ''ఆర్.ఆర్.ఆర్'' (రౌద్రం రుధిరం రణం) ట్రైలర్ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.  యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన  ఈ  ఈ భారీ మల్టీస్టారర్ పై  అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంది ట్రైలర్.   అయితే ఈ ట్రైలర్ లాంచ్ కోసం RRR టీమ్ మొత్తం ముంబైలో వాలిపోయింది.  ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్‌, అజయ్‌ దేవగణ్‌, ఆలియాభట్‌, నిర్మాత దానయ్య, రాజమౌళి సహా పలువురు పాల్గొన్నారు.  ట్రైలర్ లాంచ్ తర్వాత ఈవెంట్‌లో భాగంగా  క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్ నడిచింది. ఇందులో  అలియా భట్ తన అదృష్ట అక్షరం ఏదనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ సిగ్గుపడుతూ కనిపించింది. సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ మానవ్ మంగ్లానీ షేర్ చేసిన వీడియోలో, ఓ రిపోర్టర్ అలియా భట్‌ను 'R' లక్కీ లెటరా అని అడిగాడు. ఆమె వ్యక్తిగత జీవితంలో 'R'(రణబీర్ కపూర్) ని ఉద్దేశించి, సినిమా టైటిల్‌ (RRR)ను కూడా సూచిస్తూ ఈ ప్రశ్న వేశాడు. ఈ క్వశ్చన్ వినగానే సిగ్గుపడింది అలియా భట్.. ఆ వీడియో ఇక్కడ చూడొచ్చు.





 " మేరే పాస్ జవాబ్ నహీ హై (నా దగ్గర సమాధానం లేదు)" అన్న అలియా తెలివైన సమాధానం చెప్పేందుకు ట్రై చేస్తున్నా అని  తనతో తాన మాట్లాడుకుంది.  కొద్దిసేపటి తర్వాత జీ' (అవును) అని అంది.  'R అనేది అందమైన అక్షరం కానీ కానీ A కూడా అంతే." అంటూ సమాధాం చెప్పింది. అయితే ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే రణబీర్ , RRR మాత్రమే కాదు.. దర్శకుడు రాజమౌళి, ఆమె నటిస్తోన్న హీరో రామ్ చరణ్ పేర్లు కూడా 'R'తోనే స్టార్ట్ కావడం విశేషం.  


అలియాభట్, రణబీర్ కపూర్ చాలా కాలంగా డేటింగ్ చేస్తున్నారు. నిజానికి 2020లోనే వీరి వివాహం జరగాల్సి వుంది. కానీ కొన్ని కారణాల వలన వాయిదా పడింది. ఈ ఏడాది కచ్చితంగా పెళ్లి చేసుకుంటారని భావించారు కానీ మరో ఏడాది పాటు పెళ్లిని వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి 'R' లెటర్ సెంటిమెంట్ అలియాకి బాగా వర్కౌట్ అయ్యేట్టే ఉందంటున్నారు నెటిజన్లు.





Also Read: నాగ్ మామ.. కామకలాపాలు చూడలేకపోతున్నాం.. నటి షాకింగ్ కామెంట్స్
Also Read: RRR ట్రైలర్.. కుంభస్థలాన్ని బద్దలకొడదాం పదా.. థియేటర్లు దద్దరిల్లాల్సిందే!
Also Read: మరో మలుపు తిరిగిన కార్తీకదీపం.. డాక్టర్ బాబు , వంటలక్కకి రుద్రాణి నుంచి కొత్త కష్టాలు..
Also Read: 'పుష్ప' సెట్స్ లో గోల్డ్ బిస్కెట్స్ పంచిన బన్నీ..
Also Read: ఆ ప్రచారం నమ్మొద్దన్న నాగ చైతన్య… క్లారిటీ ఇచ్చిన 'థ్యాంక్యూ' టీమ్
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి