కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) కథానాయకుడిగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్ పతాకంపై రూపొందిన సినిమా 'వినరో భాగ్యము విష్ణు కథ' (Vinaro Bhagyamu Vishnu Katha). 'బన్నీ' వాస్ నిర్మించారు. కశ్మీర పర్ధేశీ కథానాయికగా నటించారు. ఈ శనివారం (ఫిబ్రవరి 18న) సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతే కంటే ముందు ప్రీ రిలీజ్ వేడుక చేయడానికి ఏర్పాట్లు చేశారు.
అఖిల్ అక్కినేని అతిథిగా...
'వినరో భాగ్యము విష్ణు కథ' ప్రీ రిలీజ్ వేడుకకు అఖిల్ అక్కినేని (Akhil Akkineni) ముఖ్య అతిథిగా రానున్నారు. ఆ విషయాన్నీ జీఏ2 పిక్చర్స్ అనౌన్స్ చేసింది. అఖిల్‌కు 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' వంటి విజయాన్ని ఆ సంస్థ అందించింది. అల్లు అరవింద్, నిర్మాత బన్నీ వాసుతో ఆయనకు మంచి అనుబంధం ఉంది. అందుకోసం వస్తున్నారు.
అన్నమాచార్య వారసులకు సత్కారం!
తిరుపతి నేపథ్యంలో 'వినరో భాగ్యము విష్ణు కథ' సినిమా కథ జరుగుతుంది. ఈ మధ్య 'సోల్ ఆఫ్ తిరుపతి' పేరుతో సినిమాలో నాలుగో పాట విడుదల చేశారు. ఏడు కొండల వేంకటేశ్వరునికి అపర భక్తుడైన తాళ్లపాక అన్నమాచార్య 12వ తరం కుటుంబ సభ్యుల చేత ఆ పాటను ఆవిష్కరింపజేశారు. అనంతరం వారిని ఘనంగా సత్కరించారు.
సెన్సార్ కార్యక్రమాలు పూర్తి
'వినరో భాగ్యము విష్ణు కథ' సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. మంచి సినిమా తీశారని సెన్సార్ సభ్యులు చిత్ర నిర్మాతలను ప్రశంసించారని సమాచారం. ఇటీవల విడుదలైన సినిమా ట్రైలర్ కూడా ప్రశంసలు అందుకుంది. నెంబర్ నైబర్ కాన్సెప్ట్ మీద సినిమా తీశారు.
'వాసవ సుహాస...'తో పాజిటివ్ వైబ్స్!
'వినరో భాగ్యము విష్ణు కథ' నుంచి మొదట 'వాసవ సుహాస...' పాటను విడుదల చేశారు. ఆ బాణీ, అందులో సాహిత్యం, గానం ఎంత శ్రావ్యంగా ఉన్నాయో ప్రేక్షకులు అందరూ విన్నారు. కళా తపస్వి కె. విశ్వనాథ్ 'వాసవ సుహాస'ను విడుదల చేశారు. అప్పటి నుంచి పాజిటివ్ వైబ్స్ నెలకొన్నాయి. సినిమాకు ఆ సాంగ్ మంచి బజ్ తీసుకు వచ్చింది. ఆ తర్వాత విడుదల చేసిన 'దర్శనా...' సాంగ్ కూడా ఆకట్టుకుంది. ఇప్పుడది యువతకు లవ్ యాంథమ్ కింద మారింది. సినిమా టీజర్ సైతం పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. దాంతో విడుదలకు ముందు సినిమా లాభాల్లోకి వెళ్ళిందని సమాచారం.
Also Read : 'అవెంజర్స్', 'యాంట్ మ్యాన్' విలన్ జోనాథన్ కూడా 'ఆర్ఆర్ఆర్' అభిమానే
జీఏ 2 పిక్చర్స్ సంస్థ నుంచి వస్తున్న సినిమా కావడం... ప్రచార చిత్రాలు, పాటలు ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంతో 'వినరో భాగ్యము విష్ణుకథ' విడుదలకు కొన్ని రోజుల ముందే లాభాల్లోకి వెళ్ళిందని తెలిసింది. బిజినెస్ మొత్తం క్లోజ్ అయ్యిందట. జీఏ 2 పిక్చర్స్ సంస్థకు కొంత మంది రెగ్యులర్ బయ్యర్స్ ఉన్నారు. కొన్ని ఏరియాల్లో సొంతంగా విడుదల చేస్తారు. ఆల్రెడీ సినిమా డిస్ట్రిబ్యూషన్ రేట్స్ & రైట్స్ ఫైనల్ చేశారు. డిజిటల్ & శాటిలైట్ స్ట్రీమింగ్ రైట్స్ కూడా అమ్మేశారు. వాటితో బడ్జెట్ మొత్తం రికవరీ కావడమే కాదు, లాభాలు వచ్చాయని తెలిసింది.
Also Read : నయన్ అంటే గౌరవమే - లేడీ సూపర్‌స్టార్ గొడవకు మాళవిక చెక్, ఫ్యాన్స్ ట్రోలింగ్ ఆపేస్తారా?