మేష రాశి
ఈ రాశివారు ప్రేమ సంబంధాలలో రిస్క్ చేయాల్సిన సమయం ఇది. అయితే ఆలోచించి అడుగేయండి. సడెన్ నిర్ణయాలు తీసుకోవద్దు. మీ తప్పులను మీరు సమర్ధించుకోవద్దు. బంధాల విషయంలో జాగ్రత్త.
వృషభ రాశి
మీరు మీ సంబంధాలపై మరింత నమ్మకంగా ఉంటారు. మీ భావాలను వ్యక్తీకరించడానికి మరింత బహిరంగంగా ఉండాల్సిన సమయం ఇది. మీరు మీ భాగస్వామితో సాన్నిహిత్యాన్ని ఫీలవుతారు.
మిథున రాశి
ఈ సమయంలో మీ సంబంధాలలో కమ్యూనికేషన్ చాలా ముఖ్యమైనది. మీరు మీ భాగస్వామితో లోతైన సంభాషణలు చేస్తారు.. మరింత లోతుంగా కనెక్ట్ అవుతారు.
Also Read: శివుడి శరీరభాగాలు పడిన ఐదు క్షేత్రాలివి, ఒక్కటి దర్శించుకున్నా అదృష్టమే!
కర్కాటక రాశి
ఈ సమయంలో మీరు మీ సంబంధాలలో కొన్ని హెచ్చు తగ్గులు అనుభవిస్తారు కానీ మొత్తం విషయాలు సానుకూలంగా ఉంటాయి. మీరు మీ భాగస్వామితో బలమైన భావోద్వేగ సంబంధాన్ని ఫీలవుతారు. వారిపట్ల ఆప్యాయంగా ఉంటారు.
సింహ రాశి
ఈ రాశివారు ఈ సమయంలో బంధాలు,సంబంధాల విషయంలో సంతోషంగా ఉంటారు. జీవిత భాగస్వామితో మరింత సౌకర్యవతంగా ఉంటారు. సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడం ద్వారా సక్సెస్ అవుతారు.
కన్యా రాశి
ఈ సమయంలో మీరు మీ భాగస్వామి పట్ల ప్రేమ, ప్రశంసల అనుభూతిని అనుభవిస్తారు. మీరు ప్రేమించిన వారిపట్ల మరింత శ్రద్ధ చూపిస్తారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది.
తులా రాశి
ఈ రాశివారు సంబంధాలపై మరింత నమ్మకంగా ఉంటారు. రిస్క్ తీసుకోవడానికి మరింత సిద్ధంగా ఉంటారు. మీరు మీ సంబంధాలలో సమతుల్యత, సామరస్యాన్ని కనుగొనడంపై ఎక్కువ దృష్టి పెడతారు.
Also Read: ఫిబ్రవరి నెల ఈ రాశులవారికి సమస్యలు, సవాళ్లు తప్పవు - నెలాఖరు కాస్తంత రిలీఫ్
వృశ్చిక రాశి
ఈ సమయంలో మీరు మీ భాగస్వామితో పెరిగిన సాన్నిహిత్యాన్ని ఆస్వాదిస్తారు,ఆనందిస్తారు. మీరు మీ భావాలు, ఆలోచనల గురించి మరింత బహిరంగంగా ఉండడం మంచిది. ఎదుటివారు గ్రహించుకోవాలి అనే ఆలోచనను విరమించి మీ మనసులో మాటని చెప్పడం మంచిది.
ధనుస్సు రాశి
ఈ సమయంలో మీరు మీ సంబంధాల విషయంలో కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు కానీ మొత్తం విషయాలు సానుకూలంగా ఉంటాయి. మీ భాగస్వామితో మరింత కనెక్ట్ అవుతారు. ఇద్దరి మధ్యా అవగాహన పెరుగుతుంది.
మకర రాశి
ఈ సమయంలో మీరు మీ సంబంధాలపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించినట్లు అనిపించవచ్చు , మీ భాగస్వామితో మీ బంధాన్ని బలోపేతం చేసుకోవడం గురించి మరింత ఆలోచించడం మంచిది. మీరు మీ భాగస్వామి పట్ల నిబద్ధతతో ఉంటారు.
కుంభ రాశి
ఈ సమయంలో మీరు మీ సంబంధాలలో మరింత ఉల్లాసభరితమైన క్షణాన్ని ఆస్వాదిస్తారు. మీరు మీ భావాలను వ్యక్తీకరించడంలో మరింత నమ్మకంగా ఉండవచ్చు. మనసులో భావాలను వ్యక్తపరచడం ద్వారా ప్రేమ జీవితంలో అయినా, వైవాహిక జీవితంలో అయినా సంతోషం పెరుగుతుంది.
మీన రాశి
ఈ రాశివారు ప్రేమను వ్యక్తం చేయడంలో అనుభూతి చెందుతారు. కుటుంబ సంబంధాలు బావుంటాయి. జీవిత భాగస్వామితో లోతైన భావోద్వేగ సంబంధాన్ని కలిగిఉంటారు. చిన్న చిన్న విషయాలకు కోపం తెచ్చుకోవడం తగ్గిస్తే మరింత ఆనందంగా ఉంటారు.