'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' సినిమా (RRR Movie) మెచ్చిన హాలీవుడ్‌ ప్రముఖుల జాబితాలో ఇప్పుడు మరో నటుడు చేరారు. 'ఆర్ఆర్ఆర్' చాలాసార్లు చూశానని, ఎన్టీఆర్ & చరణ్ సినిమా నచ్చిందని చెబుతున్నారు. అతనే యాంట్ మ్యాన్ విలన్ జోనాథన్. ఆయన ఏమన్నారు? ఏంటి? అనే వివరాల్లోకి వెళితే... 


ప్రముఖ హాలీవుడ్ సంస్థ మార్వెల్ స్టూడియోస్ నిర్మించే సినిమాలకు ఇండియాలో కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. ఈ వారం (ఫిబ్రవరి 17న) అమెరికాతో పాటు ఇండియాలోనూ విడుదల అవుతున్న మార్వెల్ సినిమా 'యాంట్ మ్యాన్ అండ్ ది వాస్ప్ : క్వాన్టుమేనియా' (Ant-Man and the Wasp : Quantumania) ఉంది కదా! అందులో కింగ్ ది కాంకరర్ పాత్రలో నటించిన జోనాథన్ మేజర్స్ (Jonathan Majors) ఉన్నారు కదా! తనకు 'ఆర్ఆర్ఆర్' అమితంగా నచ్చిందని ఆయన తెలిపారు. అన్నట్టు... ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 'అవెంజర్స్ : ది కాంగ్ డైనస్టీ', 'అవెంజర్స్ : సీక్రెట్ వార్స్'లో కూడా ఆయన కింగ్ డి కాంకరర్ పాత్రలో కనిపించనున్నారు.


'ఆర్ఆర్ఆర్' చాలాసార్లు చూశా - జోనాథన్
'యాంట్ మ్యాన్' విడుదల సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జోనాథన్ మేజర్స్ ఇండియన్ సినిమాల గురించి మాట్లాడారు. ''నేను ఇండియన్ సినిమాలు చూస్తాను. 'ఆర్ఆర్ఆర్' చాలా సార్లు చూశా. మూడు గంటల నిడివి ఉన్నప్పటికీ నాకు నచ్చింది. ఎన్టీఆర్, రామ్ చరణ్... ఇద్దరూ చాలా బాగా చేశారు'' అని ఆయన పేర్కొన్నారు. ఇండియన్ ఫిల్మ్స్ ఇంకా చూడాలని అనుకుంటున్నానని, ఎవరైనా సినిమాలు రికమండ్ చేయమని జోనాథన్ అడిగారు. 


అంతర్జాతీయ స్థాయిలో 'ఆర్ఆర్ఆర్' సినిమాకు ఎటువంటి ఆదరణ లభిస్తుందని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. జోనాథన్ మేజర్స్ మాత్రమే కాదు... పలువురు హాలీవుడ్ సినిమా ప్రముఖులు 'ఆర్ఆర్ఆర్'ను మెచ్చుకుంటున్నారు. హాలీవుడ్ సినిమా తీసే ఉద్దేశం ఉంటే చెప్పమని దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళిని 'అవతార్' ఫిల్మ్ మేకర్ జేమ్స్ కామెరూన్ అడిగిన సంగతి తెలిసిందే. ఇటీవల స్టీవెన్ స్పీల్‌బర్గ్ కూడా రాజమౌళిని ఇంటర్వ్యూ చేశారు. ఇప్పుడీ 'ఆర్ఆర్ఆర్' అభిమానుల జాబితాలో జోనాథన్ మేజర్స్ యాడ్ అయ్యారు. అదీ సంగతి! 


'యాంట్ మ్యాన్ అండ్ ది  వాస్ప్ : క్వాన్టుమేనియా' సినిమా విషయానికి వస్తే... ఇందులో 'యాంట్ మ్యాన్' టైటిల్ పాత్రలో పాల్ రూడ్ నటించారు. స్కాట్ లాంగ్‌గానూ ఆయన కనిపించనున్నారు. హోప్ వాన్ డీన్, వాస్ప్ పాత్రలో ఎవాంజలీన్ లీ నటించారు. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న ఈ సినిమాపై ఇండియాలో కూడా చాలా అంచనాలు ఉన్నాయి. ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.


Also Read : అన్నమాచార్య కుటుంబీకులను సత్కరించిన ‘వినరో భాగ్యము విష్ణు’ కథ టీమ్


Ant-Man and the Wasp: Quantumania India Release : ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో భారతీయ ప్రేక్షకుల ముందుకు 'యాంట్ మ్యాన్ అండ్ ది  వాస్ప్ : క్వాన్టుమేనియా' వస్తోంది. అమెరికాతో పాటు ఇండియాలో కూడా ఈ శుక్రవారం (ఫిబ్రవరి 17న) సినిమా విడుదల కానుంది.  ఎపిక్, సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్‌ను విడుదల చేస్తుంది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో 31వ చిత్రమిది. 'యాంట్ మ్యాన్' (2015), 'యాంట్ మ్యాన్ అండ్ ది వాస్ప్' (2018) తర్వాత యాంట్ మ్యాన్ సిరీస్‌లో వస్తున్న మూడో సూపర్ హీరో సినిమా.


Also Read : నారా, నందమూరి కుటుంబాలకు ఎన్టీఆర్ దూరమా? చెక్ పెట్టిన బ్రాహ్మణి, ప్రణతి