నయనతారను తమిళనాడు ప్రేక్షకులు లేడీ సూపర్ స్టార్ అంటారు. అభిమానులు ఆమెకు ఇచ్చిన ట్యాగ్ అది. అయితే... ఆ ట్యాగ్ ఏంటి? ఆమెను అలా పిలవడం తనకు నచ్చదని యంగ్ హీరోయిన్ మాళవికా మోహనన్ కాంట్రవర్సీ స్టేట్మెంట్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. దాంతో మాళవిక వివరణ ఇచ్చారు. అసలు వివరాల్లోకి వెళితే...
నయన్ అంటే ప్రేమ, గౌరవమే!
''నేను ప్రత్యేకంగా ఏ నటి గురించీ, ఎవరి గురించీ చెప్పలేదు. ఫీమేల్ యాక్టర్స్ గురించి వర్ణించేటప్పుడు, వాళ్ళ గురించి చెప్పేటప్పుడు ఉపయోగించే పదం గురించి మాత్రమే కామెంట్ చేశా. అంతే తప్ప... నేను ఎవరినీ ఏమీ అనలేదు. నయనతార అంటే నాకు నిజంగా గౌరవం. చిత్రసీమలో ఆమె నాకంటే సీనియర్. కథానాయికగా ఆమె ప్రయాణం అద్భుతమైనది. నేను ఆమెను ఆరాధిస్తాను. ఇప్పటికి అయినా సరే... సైలెంట్ అవ్వండి, ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టండి. నయనతారకు నా ప్రేమను పంపిస్తున్నాను'' అని మాళవికా మోహనన్ ట్వీట్ చేశారు.
క్లారిటీ ఇవ్వడానికి ఏం కామెంట్స్ చేశారు?
Malavika Mohanan Tweet On Nayanthara : మాళవికా మోహనన్ ట్వీట్ చూసిన తర్వాత కొంత మందికి సందేహం కలిగింది. అసలు ఆవిడ ఏం అన్నారు? ఆవిడ మాటలు ఎటువంటి వివాదానికి దారి తీశాయి? అని! మలయాళ నటుడు మాథ్యూ థామస్ జోడీగా మాళవికా మోహనన్ నటించిన సినిమా 'క్రిస్టీ'. ఇటీవల ట్రైలర్ విడుదల అయ్యింది. ఈ సందర్భంగా మలయాళ మీడియాతో మాళవికా మోహనన్ ముచ్చటించారు. అప్పుడు నయనతార గురించి స్పందించని ఆమెను కోరగా... ''నాకు లేడీ సూపర్ స్టార్ అనడం నచ్చదు'' అని సమాధానం ఇచ్చారు. ఆ మాట ఒక్కటే వైరల్ అయ్యింది.
Also Read : 'అవెంజర్స్', 'యాంట్ మ్యాన్' విలన్ జోనాథన్ కూడా 'ఆర్ఆర్ఆర్' అభిమానే
నిజానికి, మాళవికా మోహనన్ చెప్పింది ఏంటంటే... ''నాకు సూపర్ స్టార్ అనే పదమే నచ్చదు. హీరోలను (యాక్టర్లను) సూపర్ స్టార్ అనొచ్చు. కానీ, లేడీ సూపర్ స్టార్ అనడం ఎందుకు? సూపర్ స్టార్ అంటే చాలు. అసలు ఆ లేడీ ట్యాగ్ ఏంటి?'' అని వివరించారు. కట్రీనా కైఫ్, ఆలియా భట్ గురించి బాలీవుడ్ చెప్పేటప్పుడు లేడీ అనేది ఉపయోగించారనేది మాళవికా మోహనన్ ఉద్దేశం. అదీ సంగతి!
గతంలోనూ మాళవిక విమర్శలు?
మాళవికా మోహనన్ విమర్శించారని నయనతార అభిమానులు అనుకోవడానికి కారణం గతంలో ఆవిడ చేసిన వ్యాఖ్యలే. ఇంతకు ముందు ''ఓ సినిమాలో ఆస్పత్రిలో మంచం మీద ఉన్నప్పుడు కూడా ఓ టాప్ హీరోయిన్ మేకప్ వేసుకుంది'' అని మాళవికా మోహనన్ కామెంట్ చేశారు. అది నయనతారను ఉద్దేశించి చేసినదేనని చాలా మంది భావించారు. ఎందుకంటే... 'కనెక్ట్' సినిమాలో నయనతార హాస్పటల్ బెడ్ మీద ఉన్న సీన్ ఉంది. అందులో ఫుల్ మేకప్‌తో జుట్టు చెదరకుండా కనిపిస్తారు. ఆ విమర్శలకు నయనతార కౌంటర్ కూడా ఇచ్చారు. కమర్షియల్ సినిమాల్లో ఏం కావాలో దర్శకులకు తెలుసునని చెప్పారు. అంతే కాదు... ఓ హీరోయిన్ తనను విమర్శించారంటూ చెప్పడం విశేషం. ఇప్పుడు నయన్ అంటే ప్రేమ, గౌరవం అని మాళవికా మోహనన్ చెప్పడంతో లేడీ సూపర్ స్టార్ అభిమానులు శాంతిస్తారో లేదో చూడాలి.
Also Read : నారా, నందమూరి కుటుంబాలకు ఎన్టీఆర్ దూరమా? చెక్ పెట్టిన బ్రాహ్మణి, ప్రణతి