Ajay Ghosh and Chandini Chowdary starrer Music Shop Murthy first look poster out: రొటీన్ కు భిన్నంగా ఉండే సినిమాలకు ప్రేక్షకుల నుంచి ఎప్పుడూ మంచి ఆదరణ లభిస్తుంది. కొత్త కథలు, డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ ను ఆడియెన్స్ ఇష్టపడుతూనే ఉంటారు. గత కొంత కాలంగా ఇలాంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉన్నాయి. థియేటర్లలో బాగానే ఆడుతున్నాయి.  బాక్సాఫీస్ దగ్గర హిట్టు బొమ్మలుగా నిలుస్తున్నాయి. తాజాగా అలాంటి సినిమా మరొకటి రాబోతోంది. ప్రముఖ నటుడు అజయ్ ఘోష్, క్యూట్ బ్యూటీ చాందినీ చౌదరి ప్రధాన పాత్రల్లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ‘మ్యూజిక్ షాప్ మూర్తి‘ అనే పేరుతో  రూపొందుతున్న ఈ సినిమాకు శివ పాలడుగు దర్శకత్వం వహిస్తున్నారు. ఫ్లై హై సినిమాస్ బ్యానర్ మీద హర్ష గారపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు.


ఆకట్టుకుంటున్న ‘మ్యూజిక్ షాప్ మూర్తి‘ ఫస్ట్ లుక్ పోస్టర్


ఇప్పటికే ‘మ్యూజిక్ షాప్ మూర్తి‘ సినిమాకు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. మరోవైపు ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను సైతం షురూ చేసింది. అందులో భాగంగానే ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో అజయ్ ఘోష్ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నారు. చేతక్ యెల్లో కలర్ హెల్మెట్ పెట్టుకుని జర్నీ చేస్తున్నారు. హీరోయిన్ చాందినీ చౌదరి పక్కింటి అమ్మాయిలా కనిపిస్తోంది. మొత్తంగా ఈ సినిమా కంప్లీట్ ఎంటర్ టైనర్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో చాందినీ చౌదరి పాత్రకు, అజయ్ ఘోష్ కారెక్టర్‌కు ఉన్న సంబంధం ఏంటి? అసలు ఈ సినిమా పాయింట్ ఏంటి? వీరిద్దరి కథ ఏంటి? అనే ఆసక్తికరమైన ప్రశ్నలు తలెత్తేలా పోస్టర్ ఉంది.






కామెడీ క్యారెక్టర్ తో ఆకట్టుకోనున్న అజయ్ ఘోష్


తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అజయ్ ఘోష్. ఇప్పటికే విలన్ గా, కమెడియన్ గా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. ఇక షార్ట్ ఫిలిమ్స్ తో చక్కటి గుర్తింపు తెచ్చుకున్న చాందినీ చౌదరి, హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఇప్పటికే పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. అందం, అభినయంతో ఆకట్టుకుంది. కానీ, అనుకున్న స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. ఇప్పుడు వీరిద్దరు కలిసి ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ సినిమాతో ఆడియెన్స్ ను అలరించబోతున్నారు. ఈ చిత్రానికి పవన్ సంగీతాన్ని అందిస్తున్నారు. శ్రీనివాస్ బెజుగమ్ కెమెరామెన్‌గా పని చేశారు. బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటర్‌గా పని చేశారు.  త్వరలోనే ఈ సినిమా నుంచి మరిన్ని అప్ డేట్స్ ఇవ్వనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. వీలైనంత త్వరగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.   


Read Also: పబ్లిసిటీ కోసం ప్రజల మనోభావాలతో ఆడుకుంది, పూనమ్‌పై పోలీస్ కేసు పెట్టాలి - సినీ వర్కర్స్ అసోసియేషన్