Cine Workers Association demands FIR against Poonam Pandey: ప్రముఖ మోడల్,బాలీవుడ్ నటి పూనమ్ పాండే మృతి వ్యవహారం సీరియస్ అవుతోంది. మరణంతో పబ్లిసిటీకి ప్రయత్నించిందంటూ పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్ తో ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయకుండా ఉండేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు. సినీ అభిమానులు, ప్రజల మనోభాలతో ఆటలాడుకున్న పూనమ్ పై కేసు నమోదు చేయాలని ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది.


సర్వేకల్ క్యాన్సర్ తో చనిపోయినట్లు పూనమ్ ప్రకటన


హీరోయిన్ పూనమ్ పాండే సర్వేకల్ క్యాన్సర్ కారణంగా మరణించినట్లు శుక్రవారం నాడు స్వయంగా ఆమె అధికారిక ఇన్ స్టాగ్రామ్ ఎకౌంట్ లో పోస్ట్ చేయడంతో అందరూ షాక్ అయ్యారు. 32 సంవత్సరాల వయసులోనే క్యాన్సర్ తో పూనమ్ పాండే మరణించినట్లు తెలియడంతో అందరూ బాధపడ్డారు.  ఈ మృతి వార్తను ఆమె మేనేజర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. సర్వేకల్ క్యాన్సర్ కారణంగా ఆమె చనిపోయినట్లు తెలిపారు. ఈ ప్రకటనతో చాలామంది ఆందోళన చెందారు. పలువురు సినీ ప్రముఖులు, సినీ అభిమానులు, నెటిజన్లు ఆమె మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నివాళి అర్పించారు.


సర్వేకల్ క్యాన్సర్ పై అవగాహన కోసం అలా చేశానన్న పూనమ్


ఆ తర్వాత రోజు తాను బతికే ఉన్నాను అంటూ పూనమ్ వీడియో రిలీజ్ చేయడంతో అందరూ షాక్ అయ్యారు. సర్వేకల్ క్యాన్సర్ పై అందరికి అవగాహన కలిగించేందుకే తాను చనిపోయినట్లు పోస్ట్ పెట్టినట్లు క్లారిటీ ఇచ్చింది. గర్భాశయ క్యాన్సర్ కారణంగా దేశంలో ఎంతో మంది స్త్రీలు  ప్రాణాలు కోల్పోతున్నారని.. అటువంటి వారికి ఈ వ్యాధి గురించి అవగాహన కల్పించాలని ఆలోచనతో తాను చనిపోయినట్టు సోషల్ మీడియాలో ప్రచారం చేసినట్లు స్పష్టం చేశారు. అయితే, తన మరణ వార్తతో బాధపడిన ఇబ్బంది పడిన వారందరికీ క్షమాపణలు తెలిపింది.


పూనమ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన సినీ వర్కర్స్ అసోసియేషన్


పూనమ్ పాండే వ్యవహారంపై ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ సీరియస్ అయ్యింది. చీప్ పబ్లిసిటీ కోసం దేశ ప్రజల మనోభావాలతో ఆటలాడుకుందని మండిపడింది. ఆమె మున్ముందుకు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమెతో పాటు ఆమె మేనేజర్ పైనా కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. “పూనమ్ పాండే సర్వేకల్ క్యాన్సర్ తో చనిపోయిందనే ఫేక్ న్యూస్ భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఆందోళన కలిగించింది. ఇలాంటి చీప్ పబ్లిసిటీ దేశ ప్రజల మనోభావాలతో ఆడుకుంది. ఆమెతో పాటు ఆమె మేనేజర్ పైనా  చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఇలాంటి ఫేక్ న్యూస్‌లను ఎవరూ సర్క్యులేట్ చేయకుండా ఉండాలంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి” అని ముంబై పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్ లో పేర్కొంది. అయితే, ముంబై పోలీసులు ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 






Read Also: నెలకో సినిమా చొప్పున ఈ ఏడాది 15 సినిమాలు రిలీజ్ చేస్తాం: నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్