టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య కలిసి నటించిన తాజా చిత్రం 'బేబీ'. డైరెక్టర్ మారుతి సమర్పణలో మాస్ మూవీ మేకర్స్ పతాకంపై యువనిర్మాత SKN నిర్మించిన ఈ చిత్రం జూలై 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తొలి షో నుంచే పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది.'కలర్ ఫోటో' లాంటి నేషనల్ అవార్డు అందుకున్న మూవీకి కథను అందించిన సాయి రాజేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా సాగిన ఈ సినిమా థియేటర్స్ లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. నిజానికి రిలీజ్‌కు ముందే టీజర్, ట్రైలర్, సాంగ్స్, ప్రమోషన్స్‌తో ఆడియన్స్‌లో మంచి బజ్ క్రియేట్ చేసుకుంది ఈ సినిమా. విడుదల తర్వాత భారీగా కలెక్షన్లు రాబట్టింది.


ట్విట్టర్ అకౌంట్ డి-ఆక్టివేట్ చేసిన ‘బేబీ’ దర్శకుడు


ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఆగస్ట్ 25న ఓటీటీలో స్ట్రీమింగ్ కు రానుంది. ‘ఆహా’లో ఈ సినిమా విడుదల కానుంది. థియేటర్లలో దుమ్మురేపిన ఈ మూవీ డిజిటల్ రిలీజ్ పైనా భారీగా అంచనాలు ఉన్నాయి. అయితే, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే దర్శకుడు సాయి రాజేష్, ‘బేబీ’ డిజిటల్ ప్రీమియర్ కు ముందు తన ట్విట్టర్ అకౌంట్ ను డీ ఆక్టివేట్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆయన ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? అనే విషయంపై నెటిజన్లు పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నారు. అసలు కారణం ఏంటనేది ఎవరికీ తెలియనప్పటికీ, రాబోయే తన ప్రాజెక్టు విషయంపై ఎక్కువ ఫోకస్ పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  


ఇన్ స్టాలో యాక్టివ్ గా ఉన్న సాయి రాజేష్


ట్విట్టర్ అకౌంట్ ను డి-ఆక్టివేట్ చేసినప్పటికీ, ఇన్ స్టాలో మాత్రం సాయి రాజేష్ యాక్టివ్ గానే ఉన్నారు. తాజాగా ‘బేబీ’ సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రాబోతున్నట్లు అప్ డేట్ ఇచ్చారు. అందరూ ఈ సినిమా చూడాలని కోరారు. థియేటర్లలో మాదిరిగానే, ఓటీటీలో ఈ చిత్రానికి ప్రేక్షకులు మంచి ఆదరణ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.  


‘బేబీ’పై సినీ ప్రముఖుల ప్రశంసలు


ఇక  యూత్ ఫుల్ కంటెంట్ తో వచ్చిన 'బేబీ' చిత్రం ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అయ్యింది.  నేషనల్ అవార్డు అందుకున్న 'కలర్ ఫోటో' సినిమాకి కథ అందించిన సాయి రాజేష్.. హార్ట్ టచ్చింగ్ లవ్ స్టోరీ అందరినీ అలరించింది. ఇందులో ప్రేమించిన అమ్మాయి కోసం పరితమించే ట్రూ లవర్ గా ఆనంద్ దేవరకొండ చాలా బాగా నటించాడు. 'సాఫ్ట్ వేర్ డెవలపర్' వంటి యూట్యూబ్ సిరీస్ లతో పాపులర్ అయిన వైష్ణవి చైతన్య.. డెబ్యూతోనే అందరినీ ఆకట్టుకుంది. ఓవైపు డీగ్లామర్ గా కనిపిస్తూనే, మరోవైపు గ్లామరస్ గా అందంగా కనిపించింది. ఈ సినిమాపై సినీ ప్రముఖులతో పాటు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు.


Read Also: ‘అందాల ఆడబొమ్మ’ సాంగ్ రీక్రియేట్? ఈసారి కాజల్‌తో బాలయ్య రొమాన్స్!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial