కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పాన్ ఇండియా సినిమాలైన 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం', 'రాధే శ్యామ్' బృందాలు ముందు చూపుతో వ్యవహరించాయి. తమ సినిమాలను వాయిదా వేసుకున్నాయి. 'ఆర్ఆర్ఆర్' వాయిదా పడిన తర్వాత అనూహ్యంగా కొన్ని సినిమాలు సంక్రాంతి బరిలోకి వచ్చాయి. వాటిలో '7 డేస్ 6 నైట్స్' కూడా ఒకటి.

అగ్ర హీరోలతో భారీ సినిమాలు తీసిన నిర్మాత, దర్శకుడు ఎం.ఎస్. రాజు దర్శకత్వం వహించిన సినిమా '7 డేస్ 6 నైట్స్'. దర్శకుడిగా 'డర్టీ హరి' విజయం తర్వాత ఆయన తీసిన చిత్రమిది. ఇందులో ఆయన తనయుడు సుమంత్ అశ్విన్ హీరో. హీరోగా నటించడంతో పాటు నిర్మాతగానూ ఆయన పరిచయం అవుతున్నారు. వైల్డ్ హనీ ప్రొడక్షన్ పతాకంపై మెగా బ్యానర్ సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో ఎస్. రజనీకాంత్‌తో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. వింటేజ్ పిక్చర్స్ మరియు ఏబిజి క్రియేషన్స్ వారు ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వాములు.

ఎం.ఎస్. రాజు నిర్మించిన 'మనసంతా నువ్వే', 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా', 'వర్షం', 'ఒక్కడు' లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు సంక్రాంతికి విడుదల అయ్యాయి. దాంతో ఆయనకు 'సంక్రాంతి రాజు' అని పేరొచ్చింది. న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ సినిమా '7 డేస్ 6 నైట్స్'తో సంక్రాంతి బరిలో దిగాలని ఎం.ఎస్. రాజు అనుకున్నారు. అయితే... కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సినిమాను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.

"మా సినిమాలో పాట 'లెట్స్ గో దేర్'కు అద్భుత స్పందన లభించింది. ప్రేక్షకులకు థాంక్యూ. సేఫ్‌, బెట‌ర్ సిట్యువేష‌న్స్‌లో మీకు సినిమా చూపించాల‌ని అనుకుంటున్నాం. అందుకే, వాయిదా వేస్తున్నాం" అని ఎం.ఎస్. రాజు ట్వీట్ చేశారు. త్వరలో కొత్త విడుదల తేదీ ప్రకటిస్తామని ఆయన తెలిపారు.


Also Read: రానా... వెంకటేష్ బట్టలు ఇప్పేశావ్ నువ్వు!
Also Read: మ‌గాళ్ల‌కు మంచి టిప్‌... అదీ పెళ్లి త‌ర్వాత భార్య‌తో బాల‌కృష్ణ చేసుకున్న‌ అగ్రిమెంట్!
Also Read: చచ్చిపోతా, మంట పెట్టేస్తారనుకున్నా - రాజ‌శేఖ‌ర్‌ భావోద్వేగం... జీవిత కన్నీరు
Also Read: డేంజర్ ముందుంది... ఆ డేంజర్ పేరు రాకీ భాయ్... వేసవిలో!
Also Read: 'చచ్చిపో.. నీకు నరకంలో కూడా చోటుండదు..' కోవిడ్‌తో బాధపడుతున్న హీరోయిన్‌కు శాపనార్థాలు..
Also Read: నా మైండ్ పని చేయలేదు.. గుర్తుపట్టలేనంతగా మారిపోయా.. స్టార్ హీరోయిన్ కామెంట్స్..
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి.