Actress Samantha Ventures Into Sports: స్టార్ హీరోయిన్ సమంత గత కొద్ది రోజులుగా నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఆమె సినీ కెరీర్ తో పాటు, వ్యక్తిగత జీవితంపైనా బోలెడు వార్తలు వినిపిస్తున్నాయి. నాగ చైతన్యతో విడాకులు, నాగ చైతన్య శోభితతో ఎంగేజ్ మెంట్ చేసుకోవడం, ‘ది ఫ్యామిలీ మ్యాన్’ దర్శకుడితో సమంత ప్రేమాయణం అంటూ నిత్యం హెడ్ లైన్స్ లో కనిపిస్తోంది.  ఈ నేపథ్యంలో తాజాగా ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు ప్రేక్షకులలో ఓ రేంజిలో క్యూరియాసిటీ పెంచింది. ‘ఈ రోజు స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ ఇవ్వనున్నా’ అంటూ కొద్ది గంటల ముందు ఇన్ స్టాలో పోస్టు చేసింది. కచ్చితంగా ఆమె రెండో పెళ్లి గురించే చెప్పబోతుందని అందరూ భావించారు. కానీ, ఓ కొత్త విషయాన్ని చెప్పి నిజంగానే అందరినీ సర్‌ప్రైజ్‌ చేసింది.


ఇంతకీ సమంత చెప్పిన కొత్త విషయం ఏంటంటే?  


తన కెరీర్ లో మరో కొత్త ప్రయాణం ప్రారంభించినట్లు సమంత వెల్లడించింది. వరల్డ్‌ పికిల్‌ బాల్‌ లీగ్‌ లో చెన్నై ప్రాంచైజీని కొనుగోలు చేసినట్లు తెలిపింది. చెన్నై టీమ్ కు ఓనర్ గా ఉండటం సంతోషంగా ఉందన్ని చెప్పింది.  ఈ మేరకు సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టు పెట్టింది. ‘న్యూ బిగినింగ్’ అంటూ హ్యాష్ ట్యాగ్ ఇచ్చింది. పికిల్ బాల్ గేమ్ చూడ్డానికి టెన్నిస్, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ మాదిరిగానే ఉంటుంది. అయితే, నిబంధనలు వేరుగా ఉంటాయి. ఇండోర్ తో పాటు అవుట్ డోర్ లోనూ ఈ గేమ్ ఆడే అవకాశం ఉంది. సింగిల్స్ లో ఇద్దరు, డబుల్స్ లో నలుగురు ఈ ఆటను ఆడుతారు.






 అభిమానులు ఊహించింది ఒకటి.. సమంత చెప్పింది మరొకటి..


నిజానికి సమంత ఇన్ స్టా పోస్టును(ఈ రోజు స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ ఇవ్వనున్నా) చూసి చాలా మంది ఆమె పర్సనల్ లైఫ్ గురించే చెప్తుందని ఆభావించారు. గత కొంతకాలంగా ‘ది ఫ్యామిలీ మ్యాన్’ దర్శకుడితో ప్రేమలో ఉందంటూ వస్తున్న వార్తలపై క్లారిటీ ఇస్తుందని అనుకున్నారు. లేదంటే, రెండో పెళ్లి గురించి ఏమైనా హింట్ ఇస్తుందేమో? అని భావించారు. అదీ కాదంటే,  కొత్త సినిమాను అనౌన్స్ చేసే అవకాశం ఉందనుకున్నారు. కానీ, ఎవరి ఊహాలకు అందని విషయం చెప్పి నిజంగానే సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. సమంత కొత్త ప్రయాణం సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగాలని ఆమె అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఆల్ ది బెస్ట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.


ఇక సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘సిటాడెట్: హనీ బన్నీ’ వెబ్ సిరీస్ త్వరలో అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ కు రానుంది. వరుణ్ ధావన్ తో కలిసి నటించిన ఈ సిరీస్ నవంబర్ 7న విడుదలకానుంది. కొద్ది నెలల క్రితం ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాను సమంత ప్రకటించింది. ఈ మూవీకి ఆమే నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.



Read Also: ఆ డైరెక్టర్‌తో సమంత రిలేషన్‌లో ఉందా? - నాగ చైతన్య ఎంగేజ్‌మెంట్‌తో వైరల్‌ అవుతున్న సామ్‌ డేటింగ్‌ రూమర్స్‌!