Anand Deverakonda New Look: టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తమ్ముడిగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టాడు ఆనంద్ దేవరకొండ. తొలుత ఆయన నటించిన సినిమాలు యావరేజ్ గా నిలిచాయి. ‘బేబి‘ సినిమాతో ఓ రేంజిలో క్రేజ్ సంపాదించుకున్నారు. చిన్న సినిమాగా విడుదలైన ఈ మూవీ పెద్ద విజయాన్ని అందుకుంది. పలువురు సినీ పెద్దలతో పాటు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. వైష్ణవి చైతన్య, ఆనంద్ నటన అద్భుతం అంటూ అభినందించారు. ఈ సినిమా తర్వాత ఆనంద్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ సినిమా విడుదలై చాలా రోజుల తర్వాత కొత్త సినిమాపై ప్రకటన చేశాడు. ‘గం.. గం.. గణేశా’ అనే సినిమా చేస్తున్నట్లు వెల్లడించాడు. అంతే కాదు, ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు.


సిక్స్ ప్యాక్ హీరోల లిస్టులో చేరిన ఆనంద్ దేవరకొండ


తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఆనంద్ సోషల్ మీడియాలో ఓ ఫోటోను షేర్ చేశారు. ఇప్పటి వరకు పక్కింటి అబ్బాయిగా నార్మల్ గా కనిపించిన ఆయన, ఇప్పుడు సిక్స్ ప్యాక్ హీరోల్లో చేరిపోయాడు. ‘గం.. గం.. గణేశా’ సినిమాలోని యాక్షన్ సన్నివేశాల కోసం ఎంతో కష్టపడి తన లుక్ పూర్తిగా మార్చుకున్నాడు. ఇప్పటి వరకు యాక్షన్ సినిమాలు చేయని ఆయన తొలిసారి కొత్త పాత్రలో అలరించబోతున్నాడు. అటు ఆనంద్ వాళ్ల అన్నయ్య విజయ్ దేరకొండ కూడా ‘లైగర్‘ సినిమాలో సిక్స్ ప్యాక్ తో ఫిట్ గా కనిపించాడు. అయితే, ఆ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. ఇప్పుడు ఆనంద్ కు ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.    






మే 31న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘గం.. గం.. గణేశా’


‘గం.. గం.. గణేశా’ చిత్రాన్ని హై-లైఫ్ ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఫ్యామిలీ సినిమాలతో అలరించిన ఆనంద్ తొలిసారి యాక్షన్ ఎంటర్ టైనర్ తో అలరించబోతున్నాడు. ఆనంద్ తొలిసారి యాక్షన్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా మే 31న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండకు జోడీగా ప్రగతి శ్రీవాస్తవ నటిస్తోంది. కరిష్మా, వెన్నెల కిషోర్, జబర్దస్త్ ఇమాన్యుయల్ సహా పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు  చేతన్ భరద్వాజ్ అందించిన సంగీతం అందరినీ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ‘గం.. గం.. గణేశా’ నుంచి విడుదలైన పాట కూడా మంచి ఆదరణ దక్కించుకుంది. ఆనంద్, ప్రగతి కెమెస్ట్రీ అదుర్స్ అనిపించింది. ఆనంద్ కెరీర్ లో తొలిసారి క్రైమ్, కామెడీ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.


Read Also: ‘మిరాయ్‘ నుంచి అదిరిపోయే అప్ డేట్, మంచు మనోజ్ ఫస్ట్ లుక్ వచ్చేసింది, బర్త్​డేకి స్పెషల్ గ్లింప్స్​ కూడా.. ఫ్యాన్స్​కి పండగే