బాలీవుడ్ 'ఖిలాడి' అక్షయ్ కుమార్ కథానాయకుడిగా రూపొందుతోన్న హిందీ సినిమా 'బచ్చన్ పాండే'. ఈ నెల (ఫిబ్రవరి 18న) ట్రైలర్ విడుదల చేస్తున్నారు. ఈ విషయం చెబుతూ ఈ రోజు కొత్త పోస్టర్ విడుదల చేశారు. అందులో అక్షయ్ కుమార్ ఒంటి కన్నుతో క్రూరంగా కనిపించారు. ఆ పోస్టర్ మీద "నన్ను భాయ్ కాదు, గాడ్ ఫాదర్ అని అంటారు" అని కాప్షన్ ఇచ్చారు.


"పెయింట్ షాపులో ఉన్న రంగుల కంటే ఈ పాత్రలో ఎక్కువ రంగులు ఉన్నాయి. మిమ్మల్ని భయపెట్టడానికి, నవ్వించడానికి, ఏడిపించడానికి 'బచ్చన్ పాండే' వస్తున్నాడు. అతడిని ఆదరించండి. మీ ప్రేమను చూపించండి" అని అక్షయ్ కుమార్ పేర్కొన్నారు.






కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన తమిళ హిట్ 'జిగర్తాండ'కు హిందీ రీమేక్ 'బచ్చన్ పాండే'. తెలుగులో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన 'గద్దలకొండ గణేష్' సినిమాకూ 'జిగర్తాండ' ఆధారం! తెలుగులో హరీష్ శంకర్ కొన్ని మార్పులు చేశారు. హిందీలోనూ కొన్ని మార్పులు చేశారు. తెలుగులో అథర్వ చేసిన పాత్రను హిందీలో ఫిమేల్ క్యారెక్టర్ చేశారు. కృతి సనన్ ఆ రోల్ చేస్తున్నారు.  ఇంకెన్ని మార్పులు ఉంటాయో ట్రైలర్, సినిమా విడుదలైన తర్వాత తెలుస్తుంది. మార్చి 18న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 







Also Read: రియ‌ల్ వైఫ్‌కు డాక్ట‌ర్ బాబు నిరుప‌మ్ లిప్ లాక్‌! అదీ టీవీ షోలో జనాలు అందరూ ఉండగా


Also Read: హీరోయిన్ పేరుతో జనాలకు వల వేస్తున్న కేటుగాడు