Adikeshava movie ott release date: మెగా మేనల్లుడు, యువ కథానాయకుడు పంజా వైష్ణవ్ తేజ్ నటించిన తాజా సినిమా 'ఆదికేశవ'. ఆయనకు జోడీగా క్రేజీ కథానాయిక శ్రీ లీల నటించారు. నవంబర్ 24న థియేటర్లలో సినిమా విడుదల అయ్యింది. మరి, ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ఏ ఓటీటీ వేదిక సొంతం చేసుకుందో తెలుసా?


నెట్ ఫ్లిక్స్ ఓటీటీకి 'ఆదికేశవ'
Netflix bags Aadikeshava ott rights: 'ఆదికేశవ' ఓటీటీ హక్కులను ఇంటర్నేషనల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. థియేటర్లలో తమ డిజిటల్ స్ట్రీమింగ్ పార్ట్నర్ అని 'ఆదికేశవ' చిత్ర బృందం పేర్కొంది. క్రిస్మస్ లేదా న్యూ ఇయర్ సందర్భంగా సినిమాను ఓటీటీలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట! 


థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాత ఓటీటీలో సినిమాను విడుదల చేయాలని 'ఆదికేశవ' టీమ్ ప్లాన్ చేస్తోందని సమాచారం. ప్రేక్షకుల స్పందనను బట్టి ఓటీటీ రిలీజ్ డేట్ మారే అవకాశాలు ఉన్నాయి. 


పెయిడ్ ప్రీమియర్లకు మిశ్రమ స్పందన 
హైదరాబాద్, గుంటూరులోని కొన్ని థియేటర్లలో 'ఆదికేశవ' చిత్రాన్ని గురువారం రాత్రి ప్రదర్శించారు. పెయిడ్ ప్రీమియర్స్ నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. అభిమానులు కొందరు బావుందని చెబుతున్నారు. కానీ, విమర్శకుల నుంచి సినిమాకు హిట్ రిపోర్ట్ రాలేదు. డిజప్పాయింట్ చేసిందని చెబుతున్నారు.


Also Readఆదికేశవ రివ్యూ: మెగా మేనల్లుడి ఊర మాస్ యాక్షన్ - వైష్ణవ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?






వైష్ణవ్ తేజ్, శ్రీ లీల జంటగా నటించిన తొలి చిత్రమిది. ఇందులో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బావుందని చెబుతున్నారు. కామెడీ సీన్లు సైతం నవ్వించాయట. అయితే యాక్షన్ సన్నివేశాలు మరీ అతిగా ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి. ఒకవేళ బి, సి సెంటర్ ప్రేక్షకులకు సినిమా ఏమైనా నచ్చుతుందేమో చూడాలి. మల్టీప్లెక్స్ ఆడియన్స్ నుంచి సినిమాకు పాజిటివ్ టాక్ రావడం కష్టమే. 'ఆదికేశవ' ఎప్పుడో విడుదల కావాలి. పలు కారణాల వల్ల విడుదల ఆలస్యం అవుతూ వచ్చింది. సినిమా మీద అంచనాలు తగ్గడానికి అదొక కారణం కూడా!


Also Read'కోట బొమ్మాళి'లో స్ట్రాంగ్ పొలిటికల్ సెటైర్స్, ఏపీలో వ్యవస్థే టార్గెట్ - ట్విట్టర్ రివ్యూలు చూశారా?


'ఆదికేశవ' చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్ నిర్మాణ సంస్థలపై సూర్యదేవర నాగ వంశీ, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి ఎస్. సాయి సౌజన్య నిర్మించారు. హీరో స్నేహితుడిగా సుదర్శన్ నటించారు. తల్లిదండ్రుల పాత్రల్లో రాధికా శరత్ కుమార్, జయప్రకాశ్ కనిపించారు. ప్రతినాయకుడిగా మలయాళ హీరో జోజు జార్జ్, ఇతర కీలక పాత్రల్లో సుమన్, తనికెళ్ళ భరణి, అపర్ణా దాస్, సుధా తదితరులు నటించారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply