Vikram and Gautham Menon's Dhruva Natchathiram release postponed: విడుదల అవుతుందా? లేదా? ఇవాళ థియేటర్లలోకి వస్తుందా? లేదా? గురువారం ఉదయం నుంచి... ఆ మాటకు వస్తే బుధవారం నుంచి 'ధృవ నక్షత్రం' విషయంలో హైడ్రామా నెలకొంది. ఇప్పుడు సందేహాలు అవసరం లేదు. చియాన్ విక్రమ్, దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ అభిమానులకు మరోసారి నిరాశ ఎదురైంది.


సారీ చెప్పిన గౌతమ్ మీనన్!
Gautam Menon On Dhruva Natchathiram Release: 'ధృవ నక్షత్రం' సినిమా ఈ రోజు థియేటర్లలోకి రావడం లేదని దర్శకుడు గౌతమ్ మీనన్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. అందుకు గాను ప్రేక్షకులకు సారీ కూడా చెప్పారు. బుకింగ్స్ ఓపెన్ కాకపోవడంతో జనాలలో ముందు నుంచి సందేహం ఉంది. ఇప్పుడు అది నిజం అయ్యింది. 


ఒకట్రెండు రోజులు పట్టవచ్చు!
Is Dhruva Natchathiram Released: సినిమాను విడుదల చేయడానికి తమ శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ... వీలు పడలేదని గౌతమ్ మీనన్ పేర్కొన్నారు. ఒకట్రెండు రోజులు పట్టవచ్చని ఆయన తెలిపారు. ప్రేక్షకులకు మంచి థియేట్రికల్ అనుభూతి ఇవ్వడానికి, ప్రపంచ వ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్, సరిపడా థియేటర్లలో విడుదల చేయడానికి తాము ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కొన్ని రోజుల్లో తమ సినిమా థియేటర్లలోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 






'ధృవ నక్షత్రం' విడుదల ఎందుకు ఆగింది?
ఓండ్రగ ఎంటర్‌టైన్‌మెంట్, ఒరువూరిలియోరు ఫిల్మ్ సంస్థలపై గౌతమ్ వాసుదేవ్ మీనన్ 'ధృవ నక్షత్రం' సినిమా నిర్మించారు. ఫైనాన్షియల్ సమస్యల కారణంగా విడుదల వాయిదా పడింది.


Why Dhruva Natchathiram Not Released: శింబు హీరోగా తమ సంస్థలో ఓ సినిమా చేసేందుకు గౌతమ్ మీనన్ రూ. 2.40 కోట్లు అడ్వాన్స్ తీసుకున్నారని, అయితే ఆ సినిమా చేయలేదని, తమ డబ్బులు వాపస్ ఇవ్వాలని విజయ్ రాఘవేంద్ర చెన్నైలోని కోర్టును ఆశ్రయించారు. ఇవాళ ఉదయం 10.30 గంటల లోపు రెండు కోట్లు చెల్లించి సినిమా విడుదల చేసుకోమని కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే... ఆ డబ్బులు చెల్లించడంలో గౌతమ్ మీనన్ ఫెయిల్ అయ్యారు.


Also Read: ఆదికేశవ రివ్యూ: మెగా మేనల్లుడి ఊర మాస్ యాక్షన్ - వైష్ణవ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?


'ధృవ నక్షత్రం' మొదలు పెట్టినప్పటి నుంచి సినిమాను సమస్యలు వెంటాడుతూ వచ్చాయి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల చిత్రీకరణ నిలిచిపోయింది. ఈ సినిమా పూర్తి చేయడం కోసం తాను నటుడిగా సినిమాలు చేస్తున్నానని, యాక్టింగ్ ద్వారా తనకు వచ్చే రెమ్యూనరేషన్ ద్వారా 'ధృవ నక్షత్రం' చిత్రీకరణ చేస్తున్నానని ఆ మధ్య గౌతమ్ మీనన్ చెప్పారు. ఇప్పటికే పలుసార్లు విడుదల వాయిదా పడిన ఈ సినిమా మరోసారి వాయిదా పడింది. 


Also Readమమ్ముట్టి, జ్యోతిక మలయాళ సినిమా రివ్యూలు ఎలా ఉన్నాయ్ - ట్విట్టర్ టాక్ ఏంటి?



'చియాన్' విక్రమ్ సరసన హైదరాబాదీ అమ్మాయి రీతూ వర్మ కథానాయికగా నటించిన 'ధృవ నక్షత్రం' సినిమాలో ఆర్. పార్తీబన్, రాధికా శరత్ కుమార్, సిమ్రాన్, వినాయకన్, దివ్య దర్శిని, మున్నా సైమన్ తదితరులు ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి సాహిత్యం (తెలుగులో): రాకేందు మౌళి, ప్రొడక్షన్ డిజైనర్: రాజీవన్, సంగీతం: హ్యారిస్ జయరాజ్, ఛాయాగ్రహణం: మనోజ్ పరమహంస - ఎస్ఆర్ కతీర్ - విష్ణు దేవ్, సహ నిర్మాత: ప్రీతి శ్రీవిజయన్, నిర్మాణం - రచన & దర్శకత్వం: గౌతమ్ వాసుదేవ్ మీనన్.