Priyanka: బిగ్ బాస్ సీజన్ 7లో మర్డర్ టాస్క్ చాలా ఆసక్తికరంగా, కొంచెం ఫన్నీగా సాగింది. పోలీసు ఆఫీసర్లుగా అమర్‌దీప్, అర్జున్.. వారిని తప్పించుకొని తిరిగే హంతకుడిగా శివాజీ.. ఈ ముగ్గురి పర్ఫార్మెన్స్‌లు హైలెట్‌గా నిలిచాయి. కానీ హంతకుడిగా బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్‌ను సగం వరకు బాగానే నడిపించిన శివాజీ.. ఆ తర్వాత ఫెయిల్ అయ్యాడు. దీంతో ప్రియాంకను మరొక హంతకురాలిగా ఎంచుకున్నారు బిగ్ బాస్. దీంతో ఇద్దరు హంతకులను పట్టుకోవడం అర్జున్, అమర్‌దీప్‌లకు మరింత కష్టంగా మారింది. హంతకులు మాత్రం భయం లేకుండా ఒకటి తర్వాత ఒకటి హత్యలు చేసుకుంటూ వెళ్లిపోయారు. కానీ హత్యల విషయంలో కూడా ఫేవరెటిజం చూపించి తన ఫ్రెండ్‌ను కాపాడుకునే ప్రయత్నం చేసింది ప్రియాంక.


శివాజీ నుంచి ప్రియాంక చేతిలోకి..
ముందుగా శివాజీని హంతకుడని చెప్తూ సీక్రెట్ టాస్క్ ఇవ్వగా.. మొదటిగా పల్లవి ప్రశాంత్‌ను మర్డర్ చేయాలని ఆదేశించాడు బిగ్ బాస్. పల్లవి ప్రశాంత్ పెంచుకుంటున్న మొక్కను పోస్ట్ బాక్స్‌లో పెట్టమని చెప్పాడు. దీంతో శివాజీ ఈ మర్డర్ చేయడంలో సక్సెస్ అయ్యి ప్రశాంత్‌ను దెయ్యంగా మార్చేశాడు. ఇక తాజాగా ప్రసారమయిన ఎపిసోడ్‌‌లో అద్దంపై ‘క్రే బేబీ అశ్విని గెట్ ఔట్’ అని రాసి అశ్వినిని కూడా మర్డర్ చేశాడు శివాజీ. దీంతో ప్రశాంత్‌తో పాటు అశ్విని కూడా దెయ్యంగా మారిపోయింది. గౌతమ్‌ను చంపమని ఇచ్చిన టాస్కులో శివాజీ ఫెయిల్ అవ్వడంతో ఇకపై హత్యలను ప్రియాంకను చేయమని చెప్పాడు బిగ్ బాస్. దీంతో శివాజీ వెళ్లి ప్రియాంకకు టాస్క్ గురించి వివరించి, తన దగ్గర ఉన్న ఫోన్‌ను ప్రియాంకకు అందించాడు.


సక్సెస్ అయిన ప్రియాంక..
గౌతమ్‌కు తెలియకుండా ‘డెడ్’ అనే స్టిక్కర్‌ను అతికించి తనను మర్డర్ చేయమని బిగ్ బాస్ ఆదేశించాడు. దీంతో గౌతమ్‌కు తెలియకుండా తన మైక్‌పై ఆ స్టిక్కర్‌ను అతికించింది. గౌతమ్ డెడ్ అని ప్రకటన రాగానే.. యావరే తనను డెడ్ చేశాడని గౌతమ్ ఆరోపించాడు. దీంతో పోలీసులు కాసేపు యావర్‌ను అనుమానించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత బాత్రూమ్‌లో హ్యాండ్ వాష్‌లో టీ పోయమని ప్రియాంకను ఆదేశించాడు బిగ్ బాస్. ముందుగా టీ ఉన్న హ్యాండ్ వాష్‌ను ఎవరు ఉపయోగిస్తే వారు డెడ్ అని తెలిపాడు. బిగ్ బాస్ చెప్పినట్టుగానే ప్రియాంక వెళ్లి ఒక హ్యాండ్ వాష్‌లో టీ పోసి, మిగతా హ్యాండ్ వాష్‌లను దాచేసింది. అయితే తన ఫ్రెండ్ శోభా వాష్‌రూమ్‌కు వెళ్లి డెడ్ అయిపోకూడదని, తనకు ముందుగానే హింట్ ఇచ్చింది ప్రియాంక. చాలాసేపటి తర్వాత వాష్‌రూమ్‌కు వెళ్లిన యావర్.. టీ ఉన్న హ్యాండ్ వాష్‌ను ఉపయోగించి డెడ్ అయిపోయాడు. అసలు ఎలా డెడ్ అయిపోయాడో కూడా తెలియకపోవడంతో యావర్.. కన్ఫ్యూజన్‌లో ఉండిపోయాడు.


ఫ్రెండ్‌కు హెల్ప్..
పల్లవి ప్రశాంత్‌ను మర్డర్ చేయమని బిగ్ బాస్ చెప్పగానే శివాజీ ఆలోచించకుండా ఆ పనిచేశాడు. కానీ ప్రియాంక మాత్రం శోభా డెడ్ అయిపోకూడదని ఆలోచించి తనకు హెల్ప్ చేసింది. ఈ విషయం గమనించిన ప్రేక్షకులు.. వారు కలిసి ఆడుతున్నారనే విషయాన్ని మరోసారి గుర్తుచేసుకున్నారు. ఇక హంతకులు ఎవరో తెలుసుకునే క్రమంలో ముందుగా రతికను అనుమానించారు పోలీసులు. కానీ రతిక జైలులో ఉండగానే మరొక మర్డర్ జరగడంతో తను కాదని క్లారిటీకి వచ్చారు. రెండో ఛాన్సులో శివాజీనే హంతకుడు అని కరెక్ట్‌గా గెస్ చేసి ఆయనను జైలులో వేశారు. శివాజీతో పాటు మరొక హంతకుడు కూడా హౌజ్‌లో ఉన్నాడని చెప్పగానే ఆఫీసర్లకు ముందుగా ప్రియాంకపైనే అనుమానం వచ్చి తన పేరు చెప్పారు. కారణాలు కరెక్ట్‌గా చెప్పలేకపోయినా హంతకులు ఎవరో కరెక్ట్‌గా గెస్ చేసినందుకు బిగ్ బాస్.. వారిని అభినందించారు.


Also Read: నా భార్య ఆలియా నన్ను కొడుతుంది - ‘యానిమల్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో రణబీర్ షాకింగ్ స్టేట్‌మెంట్


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply