బిగ్ బాస్ రియాలిటీ షోలోకి హౌజ్‌మేట్స్‌గా ఎంటర్ అయ్యే కంటెస్టెంట్స్.. చాలావరకు ప్రేక్షకులకు ముందు నుంచే తెలిసిన వ్యక్తులు కాకపోవచ్చు. ఒకవేళ ముందు నుంచి వారిని సినిమాల్లో, సీరియల్స్‌లో చూసినా.. పర్సనల్ లైఫ్‌లో వారు ఎలా ఉంటారు అని మాత్రం ఈ రియాలిటీ షో ద్వారానే ప్రేక్షకులు తెలుసుకుంటారు. అలాగే శివాజీని హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో చూశారు ప్రేక్షకులు. కానీ ఆయన ప్రవర్తన ఎలా ఉంటుంది, ఆఫ్ స్క్రీన్ అందరితో ఎలా ఉంటారు అనే విషయాన్ని బిగ్ బాస్ సీజన్ 7లో ఆయన అడుగుపెట్టిన తర్వాతే ఆడియన్స్‌కు తెలుస్తోంది. అయితే సీజన్ మొదట్లో మంచి పేరు తెచ్చుకున్న శివాజీకి మెల్లగా ప్రేక్షకుల్లో నెగిటివ్ అభిప్రాయం ఏర్పడుతోంది.


బూతులు కంట్రోల్ చేసుకుంటున్నాను..
తను ఏం మాట్లాడినా, ఏం చేసినా కరెక్ట్ అనే మనస్థత్వం ముందు నుంచే శివాజీకి ఉంది. ఇప్పటివరకు ఆ మనస్థత్వం వల్ల ఎవరినీ పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. కానీ గత కొన్నిరోజులుగా శివాజీ మరీ మోనార్క్‌లాగా తయారవుతున్నట్టు కొందరు ప్రేక్షకులు భావిస్తున్నారు. తనకు సపోర్ట్ చేసే ఫ్యాన్స్ సైతం తన ప్రవర్తన కరెక్ట్‌గా ఉండడం లేదని భావిస్తున్నారు. తాజాగా జరిగిన నామినేషన్సే దీనికి ఉదాహరణ. ప్రియాంక.. శివాజీని నామినేట్ చేస్తున్నట్టుగా చెప్పింది. అయితే ప్రియాంక తన కారణాన్ని చెప్తుండగానే మీ అసలు రంగులు తెలుసు అని భారీ స్టేట్‌మెంట్ ఇచ్చాడు శివాజీ. ఇక నామినేషన్స్ అయిపోయిన తర్వాత కూడా ప్రియాంక వచ్చి తన తప్పేంటో అని మామూలుగా మాట్లాడే ప్రయత్నం చేసింది. కానీ మీకు మెచ్యురిటీ లేదు, నాకు బూతులు వచ్చాయి.. కంట్రోల్ చేసుకున్నా అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మొదలుపెట్టాడు శివాజీ.


లేకపోతే వెళ్లిపోయేవాడిని..
ముఖ్యంగా గతవారం.. ఇతర కంటెస్టెంట్స్‌తో శివాజీ ప్రవర్తన అసలు కరెక్ట్‌గా లేదని చాలామంది బిగ్ బాస్ ప్రేక్షకులు ఫీలవుతున్నారు. నామినేషన్స్ పూర్తయిన తర్వాత ప్రియాంక, శోభాల క్యారెక్టర్ల గురించి కూడా పాయింట్ చేసి మాట్లాడాడు శివాజీ. యావర్ నామినేషన్స్‌లో ఉన్నందుకు బాధపడుతుంటే.. మీకోసమే హౌజ్‌లో ఉన్నాను లేకపోతే ఎప్పుడో వెళ్లిపోయేవాడిని అంటూ మళ్లీ భారీ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. దీంతో శివాజీ ఏంటి ఇలా అయిపోతున్నాడు అంటూ ఫ్యాన్స్ సైతం నిరాశ చెందుతున్నారు. ముందు నుంచి చాణక్యుడిగా స్మార్ట్‌గా ఆలోచించాడు కాబట్టి ఓటింగ్ విషయంలో అయితే ఇప్పటికీ శివాజీనే ముందంజలో ఉన్నాడు.


క్యారెక్టర్ల గురించి కామెంట్స్..
హౌజ్‌లో కొంతమందిని మాత్రమే శివాజీ సపోర్ట్ చేసినట్టు మాట్లాడతాడని, కొందరిని మాత్రమే దగ్గరికి తీసుకుంటాడని ముందు నుంచి కొందరు ప్రేక్షకుల్లో నెగిటివ్ అభిప్రాయం ఉంది. హౌజ్‌లో కంటెస్టెంట్స్ మాత్రం ఈ మాట నిజం కాదని శివాజీకే సపోర్ట్‌గా నిలబడుతున్నారు. కానీ గత కొన్నివారాలుగా ప్రేక్షకులు అనుకుంటున్న విషయాలు నిజమే అన్నట్టుగా శివాజీ ప్రవర్తిస్తున్నాడు. ప్రశాంత్.. ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ను గెలుచుకున్నప్పుడు కూడా శివాజీ ఆనందం ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. గెలిచిన ప్రశాంత్‌ కంటే శివాజీనే ఎక్కువ ఫీల్ అవుతున్నాడని, అదే సందర్భంలో మిగతా కంటెస్టెంట్స్‌కు మాట్లాడడం తప్పా ఆటలు చేతకావు అన్నట్టుగా మాట్లాడుతున్నాడని భావించారు. యావర్, ప్రశాంత్‌లను రెచ్చగొట్టడం, వారు ఆటల్లో బాగా ఆడేలా మోటివేట్ చేయడం, తన పనులు చేయించుకోవడంతోనే శివాజీ బిజీగా ఉంటున్నాడని, తన ఆటను పూర్తిగా పక్కన పెట్టేశాడని బిగ్ బాస్ ఆడియన్స్ ఫీలవుతున్నారు. వారిద్దరికీ మాత్రమే సపోర్ట్ చేస్తూ ఇతర కంటెస్టెంట్స్ క్యారెక్టర్ల గురించి తక్కువ చేసి మాట్లాడడం కూడా కరెక్ట్ కాదని అనుకుంటున్నారు.


Also Read: శివాజీ ఆటకట్టు - ఇక ప్రియాంకదే భారం, అన్నను చంపించిన ‘బిగ్ బాస్’


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply