Shivaji: ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్స్ అంతా మర్డర్ టాస్క్‌లో లీనమయిపోయి ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. మర్డర్ కేసును చేధించే పోలీస్ ఆఫీసర్లుగా అమర్‌దీప్, అర్జున్.. ఫన్‌ను క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే శివాజీని హంతకుడని చెప్తూ బిగ్ బాస్ తనకు ఒక సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. ఆ సీక్రెట్ టాస్క్‌ను సక్సెస్‌ఫుల్‌గా పూర్తిచేసే ప్రయత్నంలో శివాజీ మునిగిపోయాడు. కానీ తాజాగా విడుదలయిన ప్రోమో ప్రకారం శివాజీ.. తనకు ఇచ్చిన సీక్రెట్ టాస్క్‌ను కరెక్ట్‌గా పూర్తి చేయలేకపోయాడు. అందుకే ఈ బాధ్యతను ప్రియాంకకు అప్పగించినట్టు తెలుస్తోంది.


నిన్న ప్రశాంత్.. నేడు అశ్విని..
బిగ్ బాస్ మర్డర్ టాస్క్‌లో శివాజీని మ్యానేజర్ పాత్ర పోషించమని బిగ్ బాస్ తెలిపారు. అయితే తను హంతకుడు అని ఇతర కంటెస్టెంట్స్‌కు తెలియకుండా ప్రశాంత్‌పై అనుమానం తెప్పించే ప్రయత్నం చేశాడు శివాజీ. కానీ చివరికి ప్రశాంత్ కూడా డెడ్ అని బిగ్ బాస్ ప్రకటించేసరికి అందరికి శివాజీనే హంతకుడు అనే అనుమానం మొదలయ్యింది. ఇక ఈ టాస్క్‌కు సంబంధించి రెండు ప్రోమోలు విడుదల కాగా.. అందులో మొదటి ప్రోమోలో రతిక సైతం శివాజీనే హంతకుడు అని పోలీసులకు చెప్పింది. అయితే ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా అమర్‌దీప్, అర్జున్.. అశ్వినిని విచారిస్తుండగా.. అశ్విని కూడా డెడ్ అని బిగ్ బాస్ ప్రకటించారు. దీంతో ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్‌లో ప్రశాంత్, అశ్వినిలు దెయ్యాలుగా మారిపోయారు.



కామెడీగా విచారణ..
ఇద్దరు హౌజ్‌మేట్స్ చనిపోవడంతో అర్జున్, అమర్‌దీప్‌లు ఇన్వెస్టిగేషన్‌ను మరింత సీరియస్‌గా తీసుకున్నారు. అందుకే శివాజీని కూడా విచారించాలని నిర్ణయించుకున్నాడు. శివాజీ విచారణతోనే నేటి బిగ్ బాస్ ఎపిసోడ్‌కు సంబంధించిన రెండో ప్రోమో ప్రారంభమయ్యింది. ‘‘కన్ఫెషన్ రూమ్‌లో బిగ్ బాస్ మీకు ఏం చెప్పారు?’’ అంటూ తమ విచారణను మొదలుపెట్టాడు అమర్. ఈ బిగ్ బాస్ హౌజ్‌లో మర్డర్ జరిగింది అని చెప్పారంటూ అక్కడ కూడా కామెడీ చేశాడు శివాజీ. ఒక్క మార్పు కూడా లేకుండా ప్రతీ ఒక్కరూ ఇదే పాయింట్ చెప్తున్నారంటూ అమర్‌దీప్ ఫీల్ అయ్యాడు. 


శివాజీ ఔట్.. ప్రియాంక ఇన్..
ఇక హౌజ్‌మేట్స్ అందరినీ విచారించడం పూర్తయిన తర్వాత ఇన్వెస్టిగేటర్లు.. హంతకుడు ఎవరు అని అనుకుంటున్నారో బిగ్ బాస్ చెప్పమన్నాడు. దానికి అర్జున్.. శివాజీ అనుకుంటున్నామని చెప్పాడు. ప్రూఫ్ ఏంటి అని శివాజీ రివర్స్ అయ్యాడు. ‘‘చాణక్యుడులాగా ప్లాన్స్ వేసి ఏమైనా చేయగల సమర్థుడు కాబట్టి శివాజీనే అనుకొని ఆయనను లోపల వేయాలని అనుకుంటున్నాం’’ అంటూ బిగ్ బాస్‌తో అన్నాడు అర్జున్. దీంతో తను హంతకుడు అన్న రహస్యం పోలీసులకు తెలిసిపోయింది కాబట్టి సీక్రెట్ టాస్క్‌లో ఆయన విఫలం అయ్యారని, ఇప్పటినుండి హత్యలను ప్రియాంక చేయాల్సి ఉంటుందని శివాజీకి ఫోన్ చేసి చెప్పాడు బిగ్ బాస్. ఇదే విషయాన్ని ప్రియాంకకు చెప్పి తన దగ్గర ఉన్న ఫోన్‌ను ప్రియాంకకు ఇచ్చేశాడు శివాజీ. ఆ తర్వాత గౌతమ్ మైక్‌పపై తనకు తెలియకుండానే స్టిక్కర్‌ను అతికించి తనను మర్డర్ చేయమని బిగ్ బాస్ చెప్పగా.. ప్రియాంక ఈ టాస్కులో సక్సెస్‌ఫుల్ అయ్యింది.



Also Read: హీరోయిన్స్ అంటే అంత చిన్న చూపా? నటీమణులను వేశ్యలతో పోల్చిన డైరెక్టర్ - కోలీవుడ్‌లో ఇది కామన్?


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply