Kaathal The Core Review Twitter In Telugu: మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా నటించిన కొత్త సినిమా 'కాథల్ ది కోర్'. 'నాన్ పాకల్ నేరతు మాయక్కమ్', 'క్రిస్టోఫర్', 'కన్నూర్ స్క్వాడ్'... 2023లో మమ్ముట్టి సినిమాలు మూడు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇవాళ థియేటర్లలోకి వచ్చిన 'కాథల్ ది కోర్' నాలుగోది. ఇందులో మమ్ముట్టి సరసన జ్యోతిక కథానాయికగా నటించారు. ఈ సినిమాకు సోషల్ మీడియాలో సూపర్ హిట్ పాజిటివ్ టాక్ లభిస్తోంది. ఒక్కసారి ఈ సినిమా ఎలా ఉందనేది చూస్తే...
'కాథల్ ది కోర్'కు 5/5 రేటింగ్ ఇచ్చారొకరు...
మినిమమ్ 3 రేటింగ్ ఇస్తున్న నెటిజనులు!
'కాథల్ ది కోర్' చిత్రానికి స్వాతి అనే నెటిజన్ ఒకరు 5/5 రేటింగ్ ఇచ్చారు. ప్రముఖ తమిళ & మలయాళ ఫిల్మ్ క్రిటిక్ శ్రీదేవి శ్రీధర్ ఈ చిత్రానికి 4/5 రేటింగ్ ఇచ్చారు. షణ్ముగమ్ అనే రివ్యూ రైటర్ 3.5/5 రేటింగ్ ఇచ్చారు.
Also Read: మంగళవారం సినిమా రివ్యూ: అమ్మాయిలో లైంగిక వాంఛ ఎక్కువ అయితే? కోరికలు పెరిగితే?
మమ్ముట్టి బెస్ట్ వర్క్... ఎమోషనల్ ఫిల్మ్!
పల్లెటూరి వాతావరణం నేపథ్యంలో భార్యాభర్తల మధ్య జరిగే కథతో 'కాథల్ ది కోర్' సినిమా తెరకెక్కించారు. ఇందులో మమ్ముట్టి మరోసారి తన నటన, హావభావాలతో ఆకట్టుకున్నారని పలువురు ట్వీట్లు చేస్తున్నారు. జ్యోతిక నటన గురించి సైతం ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. మమ్ముట్టి భార్య పాత్రలో ఆమె జీవించారని చెబుతున్నారు. సినిమాలో ఎమోషన్స్ హైలైట్ అంటున్నారు.
'కాథల్ ది కోర్' సినిమా స్లోగా ఉంటుందని, కానీ సినిమా మాత్రం అద్భుతంగా ఉందని మరో నెటిజన్ పేర్కొన్నారు. సినిమా రివ్యూలు చదివే ముందు... ఈ ట్వీట్స్ ఒక్కసారి చూడండి.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply