KotaBommali PS Movie Twitter Review In Telugu: శతాధిక చిత్ర కథానాయకుడు శ్రీకాంత్, విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'కోట బొమ్మాళి పీఎస్'. ఇందులో రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ జంటగా నటించారు. 'జోహార్', 'అర్జున ఫాల్గుణ' చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న తేజా మార్ని దర్శకత్వం వహించారు. 


సీట్ ఎడ్జ్ థ్రిల్లర్... శ్రీకాంత్ క్యారెక్టర్ గుర్తుంటుంది!
మలయాళ సినిమా 'నాయట్టు'లో మూలకథ తీసుకుని, తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు, చేర్పులతో 'కోట బొమ్మాళి పీఎస్' తెరకెక్కించారు. ఈ రోజు (నవంబర్ 24న) సినిమా థియేటర్లలో విడుదల అవుతోంది. అయితే... గురువారం రాత్రి టాలీవుడ్ ప్రముఖులు కొందరికి షో వేశారు. దర్శకులు హరీష్ శంకర్, చైతన్య దంతులూరితో పాటు హీరోలు శ్రీవిష్ణు, నిఖిల్ సినిమా చూశారు. 


Also Readఆదికేశవ రివ్యూ: మెగా మేనల్లుడి ఊర మాస్ యాక్షన్ - వైష్ణవ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?


'కోట బొమ్మాళి పీఎస్' సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ అని సెలబ్రిటీలు తెలిపారు. ముఖ్యంగా శ్రీకాంత్ & వరలక్ష్మీ శరత్ కుమార్ మధ్య సన్నివేశాలు ఉత్కంఠ కలిగిస్తాయని సినిమా చూసిన వారందరూ ముక్తకంఠంతో చెబుతున్నారు. 


వ్యవస్థపై డైలాగులు... హరీష్ శంకర్ ప్రశంసలు
ప్రస్తుత రాజకీయాలపై 'కోట బొమ్మాళి పీఎస్'లో ఎటువంటి సెటైర్స్ వేయలేదని, వ్యవస్థలో జరుగుతున్నది చూపించామని దర్శక - నిర్మాతలు, నటీనటులు ముందు నుంచి చెబుతూ వస్తున్నారు. దర్శకుడు హరీష్ శంకర్ చెబుతున్న మాటలను బట్టి చూస్తే... సినిమాలో పొలిటికల్ డైలాగులు గట్టిగా ఉన్నట్లు అర్థం అవుతోంది.


Also Readమమ్ముట్టి, జ్యోతిక మలయాళ సినిమా రివ్యూలు ఎలా ఉన్నాయ్ - ట్విట్టర్ టాక్ ఏంటి?


ప్రస్తుత వ్యవస్థ మీద రాసిన కొన్ని డైలాగులు బలంగా ఉన్నాయని, ఇతరులు వాటి పట్ల ఎలా స్పందిస్తారో తనకు తెలియదు గానీ కొన్ని డైలాగులకు తాను బాగా కనెక్ట్ అయ్యానని హరీష్ శంకర్ చెప్పారు. నిర్మాతల గట్స్ ను ఆయన మెచ్చుకున్నారు. శివానీ రాజశేఖర్, రాహుల్ విజయ్ నటనతో పాటు తేజా మార్ని దర్శకత్వాన్ని శ్రీవిష్ణు ప్రశంసించారు. సినిమాలో ఎమోషనల్ పార్ట్ అందరికీ కనెక్ట్ అవుతుందని హీరో నిఖిల్ సిద్ధార్థ పేర్కొన్నారు. 


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply