UP Election Result 2022: ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌లో భారతీయ జనతా పార్టీ హవా కనిపిస్తోంది. ఏబీపీ-సీ ఓటర్ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ దాదాపు 250 స్థానాలకు పైగా భాజపా లీడ్‌లో ఉంది. మరోవైపు సమాజ్‌వాదీ పార్టీ 100కు పైగా స్థానాల్లో మెజార్టీ కనబరుస్తోంది.
కమల వికాసం
ఉత్తర్‌ప్రదేశ్‌లో భాజపా మరోసారి అధికారం చేపట్టే దిశగా దూసుకెళ్తోంది. యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలో ఎన్నికలకు దిగిన భాజపా మెజార్టీ దిశగా పయనిస్తోంది. యూపీలో భాజపా వరుసగా రెండోసారి అధికారం చేపట్టనుంది. సీఎం యోగి ఆదిత్యనాథ్ తాను పోటీ చేసిన గోరఖ్‌పుర్ అర్బన్ స్థానంలో ముందంజలో ఉన్నారు.
సైకిల్ వెనుకంజ
మరోవైపు సమాజ్‌వాదీ పార్టీ 120కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. యోగి ఆదిత్యనాథ్‌ను గద్దె దించి మరోసారి అధికారంలోకి రావాలని ఆశించి సమాజ్‌వాదీ పార్టీకి భంగపాటు తప్పలేదు.
సింగిల్ డిజిట్
కాంగ్రెస్ పరిస్థితి ఉత్తర్‌ప్రదేశ్‌లో దయనీయంగా ఉంది. సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ రంగంలోకి దిగినప్పటికీ ఫలితం లేకపోయింది.