Telangana Elections 2023 :  తెలంగాణలో ములుగు అసెంబ్లీ నియోజకవర్గానికి ఓ ప్రత్యేక ఉంది. పూర్తిగా గిరిజన నియోజకవర్గం మాత్రమే కాదు ఈ సారి అక్కడ పోటీ పడుతున్న రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులు మావోయిస్టు నేపధ్యం ఉన్న వారే.  


ములుగు కేంద్రంగా జిల్లా ఏర్పాటు 
 
తెలంగాణలో ములుగు కేంద్రంగా ములుగు ( Mulugu ) జిల్లా ఏర్పాటైంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అంతర్భాగంగా ములుగు ఉండేది. జిల్లాల పునర్విభజనలో భాగంగా ములుగు కు జిల్లా హోదా దక్కలేదు. ములుగు రెవెన్యూ డివిజన్‌ గా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కలపడం జరిగింది. గిరిజన ప్రాంతమైన ములుగు ను జిల్లాగా ఏర్పాటు చేయాలని అక్కడి ప్రజలు పోరాటం చేయడంతో ప్రభుత్వం 2019 ఫిబ్రవరి 16వ తేదీన ములుగును జిల్లాగా ఏర్పాటు చేసింది. 9 మండలాలతో ఈ జిల్లాను ఏర్పాటుచేశారు. ములుగు, గోవిందరావుపేట, ఏటూరునాగారం, వెంకటాపూర్, తాడ్వాయి, కన్నాయిగూడెం, మంగపేట, వాజేడ్, వెంకటాపురం మండలాలు ములుగు జిల్లాలో ఉన్నాయి. జిల్లా కేంద్రమైన ములుగు మినహా మిగతా అన్ని మండలాలు ఏజెన్సీలోని ఉంటాయి. జిల్లాలో 2 లక్షల 94 వేల జనాభా ఉంది. ములుగు నియోజకవర్గంలో 2 లక్షల 20వేల 816 మంది ఓటర్లు ఉన్నారు.


అభయారణ్యంలో ఉండే నియోజకవర్గం ములుగు 


ఆదివాసీ జిల్లాగా పేరున్న ములుగు జిల్లా.  అభయారణ్యం. ఆదివాసీ గిరిజన సంప్రదాయాలకు, ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ములుగు జిల్లాలోనే ఉంది. అంతేకాదు తెలంగాలోనే పేరున్న పర్యాటక ప్రాంతాలకు ములుగు జిల్లా స్వంతం. ములుగు జిల్లాలో ఆదివాసీ, లంబాడీ గిరిజనులు ఎక్కువ. వీరితోపాటు ఇతర సామాజిక వర్గాలకు చెందిన ప్రజలు అటవీ ఉత్పత్తులు, వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తారు. అభయారణ్యం ములుగు జిల్లాలో ఏకైక నియోజకవర్గం ములుగు. పూర్వ ఉమ్మడి వరంగల్ జిల్లాలో అతిపెద్ద నియోజకవర్గం ములుగు.  ములుగు జిల్లాలో ఏకైక నియోజకవర్గం ములుగు. నియోజకవర్గం పూర్తిగా అభయారణ్యం. 


అభివృద్ధి అంతంత మాత్రమే ! 


నియోజకవర్గం అభివృద్ధికి అమడదూరంలో ఉంటుంది. ఇప్పటికి ఈ నియోజకవర్గంలో కారు చికట్లో కాలం వెళ్లదీసే గూడేలు  ఎక్కువ. ఇప్పటికి కనీస సౌకర్యాలు లేవు. ప్రజలు సమస్యలతో సహజీవనం చేస్తారు. ములుగు జిల్లాలో  ములుగు, గోవిందరావుపేట, ఏటూరునాగారం, వెంకటాపూర్, తాడ్వాయి, కన్నాయిగూడెం, మంగపేట, వాజేడ్, వెంకటాపురం తొమ్మిది మండలాలు ఉండగా వాజేడు, వెంకటపురం మండలాలు భద్రాచలం నియోజవర్గంలో కలుస్తాయి. మిగితా  ములుగు, గోవిందరావుపేట, ఏటూరునాగారం, తాడ్వాయి, కన్నాయిగూడెం, మంగపేట, వెంకటాపూర్ తోపాటు వరంగల్ జిల్లాలోని నల్లబెల్లి మండలంలోని కొన్ని గ్రామాలు ములుగు నియోజకవర్గంలోకి వస్తాయి. అయితే ములుగు జిల్లా కాకముందు ఏ నియోజవర్గ పరిధి ఉందో ఇప్పుడు అదే నియోజకవర్గ పరిధి ఉంది. 


కాంగ్రెస్ కంచుకోట 


ఈ నియోజవర్గానికి 1952 నుంచి ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో అత్యధికంగా గిరిజనులే ఎమ్మెల్యే గా ప్రాతినిథ్యం వహించారు. 1952 నుంచి ఇప్పటివరకు ఎమ్మెల్యే లు, ప్రభుత్వాలు మారిన, గిరిజనులకు ప్రత్యేక పథకాలు, చట్టాలు ఉన్న ములుగు నియోజకవర్గం అభివృద్ధి కి దూరంగానే ఉంది. ప్రస్తుతం ఈ నియోజవర్గానికి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్నారు.  ఇప్పటివరకు జరిగిన ఎన్నికల ప్రక్రియలలో ఏ అభ్యర్థి కూడా రెండుసార్లకు మించి గెలుపొందిన దాఖలాలు లేవు. 2023 ఈసారి జరుగుతున్న ఎన్నికలు బి ఆర్ ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య పోరా పోరి పోరు జరగనుంది. కాంగ్రెస్ నుండి సీతక్క, ( Seetakka (  టిఆర్ఎస్ నుండి ప్రస్తుతం ములుగు జిల్లా జడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి ( Bade nagajyothi ) , బీజేపీ నుండి మాజీ మంత్రి చందూలాల్ కుమారుడు ప్రహ్లాద్ పోటీపడుతున్నారు. సీతక్క, నాగజ్యోతి ఆదివాసి గిరిజనులు కాగా, ప్రహ్లాద్ లంబాడీ సామాజికవర్గం. 


1952 నుంచి ఇప్పటి వరకు గెలిచిన ఎమ్మెల్యేలు.


2018 లో సీతక్క కాంగ్రెస్.
2014 లో అజ్మీరా చందులాల్, టీఆర్ ఎస్.
2009 లో   సీతక్క, కాంగ్రెస్.
2004 లో పోదెం వీరయ్య, కాంగ్రెస్.
1999 లో పోదెం వీరయ్య,  కాంగ్రెస్.
1996 లో చర్ప భోజా రావు, తెలుగుదేశం. 
1994 లో అజ్మీరా చందులాల్, తెలుగుదేశం.
1989 లో పోరిక జగన్నాయక్,MINC.
1985 లో అజ్మీరా చందులాల్. తెలుగుదేశం.
1983 లో పోరిక జగన్ నాయక్, MINC. 
1978 లో పోరిక జగన్నాయక్, MINC. 
1972 లో సంతోష్ చక్రవర్తి, MINC.
1967 లో సంతోష్ చక్రవర్తి స్వతంత్ర అభ్యర్థి. 
1962 లో ముసినపల్లి కృష్ణయ్య, MINC. 
1957 లో రాజేశ్వరరావు ,MPDF అభ్యర్థి.
1952 లో హన్మంతరావు, పీడీఫ్.