Karnataka Election Results 2023:  కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికాసేపట్లో పూర్తి స్థాయిలో క్లారిటీ రానుంది. ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్స్ చూస్తే కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీతో పాటు జేడీఎస్ మధ్య గట్టి పోటీ నెలకొంది.


ట్రెండ్స్ ప్రకారం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేలా కనిపిస్తోంది కానీ కాంగ్రెస్ గెలిస్తే ఆ పార్టీ నుంచి సీఎం పదవికి పోటీదారు ఎవరు అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ప్రస్తుతం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఈ రేసులో ముందంజలో ఉన్నారు.


ముఖ్యమంత్రి పదవి విషయంలో తనకు, శివకుమార్‌కు మధ్య ఏమైనా విభేదాలున్నాయా అని సిద్ధరామయ్యను చాలా మంది మీడియా ప్రతినిధులు అడిగితే.. 'కాంగ్రెస్ ఇంకా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదని... కచ్చితంగా ఆయన తనకు పోటీదారు అని ఒప్పుకున్నారు. 


ముఖ్యంగా కర్ణాటకలో ఎన్నికల ఫలితాలకు ముందు ముఖ్యమంత్రి పేరు ప్రకటించకపోవడం కాంగ్రెస్‌లో వస్తున్న ఆనవాయితీ. ఇది చాలా ఏళ్ల తరబడి కొనసాగుతున్న ప్రక్రియ. పార్టీ మెజారిటీతో అధికారంలోకి వస్తే ముందుగా ఎన్నికైన ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాన్ని చెబుతారు. అప్పుడు హైకమాండ్ నిర్ణయిస్తుందన్నారు.


అయితే కాంగ్రెస్ కు మెజారిటీ వస్తే సిద్ధరామయ్య, డీకేఎస్ మధ్య సీఎం పదవి కోసం పోరు తీవ్రమవుతుందని పార్టీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. సిద్ధరామయ్య అనుభవజ్ఞుడు, సీనియర్ నాయకుడని, ప్రభుత్వాన్ని నడిపిన అనుభవం ఉందని కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యే  అభిప్రాయపడుతున్నారు. ఆయనకు ప్రత్యర్థిగా ఉన్న డీకేఎస్ కాంగ్రెస్‌కు అత్యంత సన్నిహితుడు. 


సిద్దరామయ్య


కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వస్తాయనేది మరికాసేపట్లో తేలిపోనుంది. కాంగ్రెస్ మేజిక్ ఫిగర్ దాటితే మాత్రం కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య మళ్లీ ముఖ్యమంత్రి రేస్‌లో బలంగా నిలబడతారు. 


సిద్ధరామయ్య 2013 నుంచి 2018 వరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ మెజారిటీతో గెలిస్తే పార్టీకి సిద్ధరామయ్యే మొదటి ఛాయిస్ కావచ్చు అనే అంచనాలు ఉన్నాయి. 


మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన హయాంలో సామాజిక, ఆర్థిక సంస్కరణల పథకాల ద్వారా అనేక మార్పులు తీసుకొచ్చారు. పేదల కోసం అనేక పథకాలకు శ్రీకారం చుట్టారు. ఏడు కిలోల బియ్యం ఇచ్చే అన్న-భాగ్య పథకం, పాఠశాలకు వెళ్లే విద్యార్థులందరికీ 150 గ్రాముల పాలు అందించే క్షీర్-భాగ్య పథకం, ఇందిరా క్యాంటీన్ రాష్ట్రంలోని పేదలకు ఎంతో ఉపశమనం కలిగించాయి.


సిద్ధరామయ్య తన పదవీకాలంలో రాష్ట్రంలో ఆకలి, విద్య, మహిళలు, నవజాత శిశు మరణాల నివారణకు పథకాలను ప్రారంభించారు, ఇది రాష్ట్రంలోని లక్షలాది పేద కుటుంబాలకు ఉపశమనం కలిగించింది. సిద్దరామయ్య తన హయాంలో బాలికలకు గ్రాడ్యుయేషన్ వరకు ఉచిత విద్య, కళాశాల విద్యార్థులకు ల్యాప్ టాప్ లు, పంచాయతీల్లో మహిళలకు తప్పనిసరి చేయడం, గర్భం దాల్చిన తర్వాత 16 నెలల పాటు మహిళలకు పౌష్టికాహారం అందించడం వంటి పథకాలు తీసుకొచ్చారు. 


సిద్ధరామయ్య గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు లింగాయత్‌లలో, ముఖ్యంగా హిందూ ఓటర్లలో వ్యతిరేకత తీసుకొచ్చాయి. 


డీకే శివకుమార్


మే 12వ తేదీ శుక్రవారం డీకే శివకుమార్ చేసిన ట్వీట్ చూస్తే డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పీఠంపై గట్టి నమ్మకంతో ఉన్నారని తెలుస్తోంది. వాస్తవానికి, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ఒక రోజు ముందు, డికె శివకుమార్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా తన మూడేళ్ళ కృషికి సంబంధించిన ట్రైలర్ వీడియోను పెట్టారు. 


కనకపుర నియోజకవర్గం నుంచి డీకే శివకుమార్ వరుసగా 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని శివకుమార్ ఎప్పటి నుంచో కలగంటున్నారు. 


కర్ణాటకలో రెండు వర్గాలు..


కర్ణాటకలో రెండు బలమైన గ్రూపులు ముఖాముఖి తలపడ్డాయి. మొదటి వర్గం సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యది కాగా, రెండో వర్గం డీకే శివకుమార్‌ది. ఇరువురు నేతల మద్దతుదారులు ఒకరిపై ఒకరు బాహాటంగానే విమర్శలు చేసుకున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి అయ్యే విషయంలో ఇప్పటికీ ఇరువురు నేతల మధ్య వివాదం కొనసాగుతోంది.