YS Sharmila :   CBI  ఛార్జిషీట్ లో  వైఎస్సార్  పేరు చేర్పించింది  మా అన్న జగన్ మోహన్ రెడ్డేనని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ప్రకటించారు. ఇప్పటి వరకూ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పై జగన్ ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. తాజాగా పులివెందులలో నామినేషన్ వేసిన సభలోనూ చనిపోయిన వైఎస్ఆర్ పేరును సోనియా చార్జిషీటులో పెట్టించారని జగన్ ఆరోపించారు. ఈ క్రమంలో ఎన్నికల ప్రచార సభల్లో కీలక వ్యాఖ్యలు చేశారు.   CBI YSR పేరును చార్జీ షీట్ లో చేర్చలేదు .. ఇవ్వాళ అసలు విషయాలు చెప్తున్నానన్నారు.  *CBI లో చేర్పించింది జగన్ మోహన్ రెడ్డి లాయర్ అని ్సపష్టం చేశారు.  కేసు నుంచి జగన్ ను బయట పడేసేందుకు YSR పేరును CBI చార్జిషీట్ లో చేర్పించాడన్నారు.   పొన్నవోలు సుధాకర్ రెడ్డి అనే లాయర్ తో హై కోర్టు లో చేర్పించాడని..  పిటీషన్ వేసి మరి చేర్పించాడని ఆరోపించారు.  ప్రతిఫలంగా అదే సుధాకర్ రెడ్డికి అడ్వకేట్ జనరల్ పదవి ఇచ్చాడని గుర్తు చేశారు. ప్రస్తుతం ఆ పిటిషన్ వేసిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఏ ఏజీగా ఉన్నారు.  ఇది వాస్తవం కాదా జగన్ రెడ్డి సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్  చేశారు. 


  
చూసుకుంటూ రాసిచ్చిన స్క్రిప్ట్ చదివేది జగన్ రెడ్డినేనన్నారు.  మక్కీకి మక్కీ చదివేది జగన్ రెడ్డేనని మండిపడ్డారు.  నేను వైఎస్ఆర్ బిడ్డను..నాకు మోకరిల్లె అవసరం లేదన్నారు.  మీ కుక్క బిస్కెట్లు తిని ఎంతో మంది నాపై తప్పుడు ప్రచారం చేసినా పట్టించుకోలేదని గుర్తు చేశారు.  బీజేపీ దగ్గర మోకరిల్లింది మీరు.. మోడీకి దత్తత పుత్రుడు జగన్ రెడ్డన్నారు.  జగన్ రెడ్డి YSR వారసుడు కాదు...మోడీ వారసుడన్నారు.  క్రైస్తవులను చంపుతుంటే మోడికి మద్దతు పలికాడన్నారు.  అయ్యా మీకు ఇవ్వాళ బందువులు ఎవరు అని ప్రశ్నించారు.  మీకోసం పరితపించిన వాళ్ళు ఇవ్వాళ మీ వెనకా ముందు ఉన్నారో చూస్కోండి అని సలహా ఇచ్చారు. 


జగన్ రెడ్డి తో చెల్లెల్లు ఎవరు లేరు..  YSR ను తిట్టిన రోజా,రజినీ ఇప్పుడు జగన్ కి చెల్లెల్లు ..అసెంబ్లీ వేదికగా YSR ను తిట్టిన వాళ్ళు ఈయనకు బంధువులు అని ఎద్దేవా చేశారు.   మమ్మల్ని తిట్టిపోసే మీరు ఆలోచన చేసుకోవాలని షర్మిల సూచించారు.  సౌభాగ్యమ్మ లెటర్ రాస్తే కనీసం స్పందన లేదన్నారు.  హంతకులను రక్షిస్తూ వాళ్ళకే ఎంపీ టిక్కెట్లు ఇచ్చారన్నాు.  వివేకా ప్రజా నాయకుడు అని గానీ ...YSR కి తమ్ముడు అని ఎందుకు చెప్పలేదని ఆమె ప్రశ్నించారు.  


సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ అన్నారని, ఏమైందని, ఐదు సంక్రాంతిలొచ్చాయని, కానీ జాబ్ క్యాలెండర్ రాలేదు కానీ కోడిపందేలు జరిగాయని ఎద్దేవా చేశారు. ఐదు సంవత్సరాలు ఉద్యోగాలు ఇవ్వకుండా ఇప్పుడు మేల్కొంటారా .. కుంభకర్ణుడైనా ఆరు నెలలకు లేస్తారని, జగన్ ప్రభుత్వం ఎందుకు మేల్కోలేదని షర్మల విమర్శలు గుప్పించారు.మూడు రాజధానులన్నారని, ఒక్కటీ లేకుండా చేశారని, ఎపి రాజధాని ఏదంటే చెప్పలేని పరిస్థితికి తీసుకొచ్చారని, మీ చేతిలో ఉన్న ఓటు అనే ఆయుధాన్ని సరైన వ్యక్తికి వేయాలని, జగన్‌ను నమ్మి గెలిపిస్తే నట్టేట ముంచుతారని షర్మిల  విమర్శించారు. 


జగన్ పాలనలో రైతులంతా అప్పులపాలయ్యారని, రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అన్నారని, ఏమైందని, ఒక్క ఏడాదైనా రైతుల కోసం రూ.3 వేల కోట్ల పక్కన పెట్టారా? అని ప్రశ్నించారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకున్న పరిస్థితి లేదన్నారు. పూర్తి మద్యపాన నిషేధమన్నారని, సర్కారే మద్యం అమ్ముతోందని, నాసిరకం మద్యం తాగి కిడ్నీలు పాడైపోయి చనిపోతున్నారని, బటన్ నొక్కితే వచ్చేది వంద రూపాయిలు కానీ జగన్ లాక్కుంటుంది వెయ్యి రూపాయలు అని ఆమె మండిపడ్డారు.