Punjab Assembly Elections 2022: కాంగ్రెస్, ఆప్ రెండూ దోస్తీ- పంజాబ్‌లో పైపైనే కుస్తీ: మోదీ

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, ఆమ్‌ఆద్మీపై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు చేశారు.

Continues below advertisement

కాంగ్రెస్ ఒరిజినల్ అయితే.. ఆమ్‌ఆద్మీ దాని జెరాక్స్ కాపీ అని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పఠాన్‌కోట్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ మాట్లాడారు. 

Continues below advertisement

కాంగ్రెస్, పంజాబ్ రెండూ ఒకటే. కాంగ్రెస్ ఒరిజినల్ అయితే ఆప్‌ దాని డూప్లికేట్. ఒక పార్టీ పంజాబ్‌ను లూఠీ చేస్తే మరో పార్టీ దిల్లీలో వరుస కుంభకోణాలు చేస్తోంది. పైకి మాత్రం రెండూ ఒకరిపై ఒకరు కుస్తీ చేస్తున్నట్లు నమ్మిస్తున్నాయి. కానీ ఆ రెండూ ఎప్పుడూ ఒకటే.                                    -  ప్రధాని నరేంద్ర మోదీ

కాంగ్రెస్‌పై

పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్.. కాంగ్రెస్‌ను వీడి భాజపాతో కలిసి పోటీ చేయడంపై కూడా ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.

పంజాబ్ మాకు చాలా ముఖ్యం. కానీ ఇతర పార్టీలు మాత్రం పంజాబ్‌ను రాజకీయాల కోసం వాడుకుంటున్నాయి. కెప్టెన్ అమరీందర్ సింగ్.. కాంగ్రెస్‌లో ఉన్న సమయంలో వారిని తప్పుదోవలో వెళ్లకుండా ఆపేవారు. కానీ ఇప్పుడు ఆయన కూడా వాళ్లతో లేరు.                                        -  ప్రధాని నరేంద్ర మోదీ

ప్రత్యేక పూజలు

అంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీ దిల్లీలోని శ్రీ గురు రవిదాస్ విశ్రమ్ ధామ్ మందిరాన్ని దర్శించుకున్నారు. మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు.

విశ్రమ్ ధామ్ మందిరంలో నిర్వహించిన 'షాదాబ్ కీర్తన్​'లో మోదీ పాల్గొన్నారు. సంప్రదాయ వాద్య పరికరాన్ని చేతిలో పట్టుకొని భజనలో పాల్గొన్నారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

Also Read: New Road Safety Rules: బండిపై పిల్లల్ని తీసుకెళ్తున్నారా? అయితే ఇక ఈ రూల్స్ పక్కా

Also Read: Ravidas Jayanti 2022: పంజాబ్ ఎన్నికల వేళ ప్రధాని మోదీ భక్తి పారవశ్యం!

Continues below advertisement
Sponsored Links by Taboola