EX MP Vijayasai Reddy | న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ ఎన్నిక వచ్చింది. ఇటీవల ఖాళీ రాజ్యసభ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్న వి.విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) ఇటీవల రాజీనామాతో ఒక్క రాజ్యసభ స్థానం ఖాళీ అయింది. విజయసాయిరెడ్డి వైసీపీకి రాజీనామా చేయడంతో పాటు రాజ్యసభ సభ్యత్వానికి సైతం రాజీనామా చేసి పార్టీ అధినేత జగన్‌కు బిగ్ షాకిచ్చారు.
ఏపీలో ఖాళీ అయిన ఒక్క రాజ్యసభ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ఏప్రిల్ 29వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఏప్రిల్ 30న అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ చేపడతారు. అభ్యర్థులకు నామినేషన్ ఉపసంహరణకు మే 2 తేదీ వరకు ఈసీ గడువు ఇచ్చింది. మే 9న ఆ రాజ్యసభ స్థానానికి ఎన్నిక నిర్వహించి, అదే రోజు సాయంత్రం ఓట్లు లెక్కించి విజేతను ప్రకటిస్తారు.