ప్రధాని నరేంద్ర మోదీ దిల్లీలోని శ్రీ గురు రవిదాస్ విశ్రమ్ ధామ్ మందిరాన్ని దర్శించుకున్నారు. మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు.





విశ్రమ్ ధామ్ మందిరంలో నిర్వహించిన 'షాదాబ్ కీర్తన్​'లో మోదీ పాల్గొన్నారు. సంప్రదాయ వాద్య పరికరాన్ని చేతిలో పట్టుకొని భజనలో పాల్గొన్నారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.






ఇందుకే వాయిదా


నిజానికి పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 14న జరగాల్సి ఉంది. కానీ వివిధ  రాజకీయ పార్టీల డిమాండ్ మేరకు ఈసీ ఫిబ్రవరి 20కి వాయిదా వేసింది. గురు రవిదాస్ జయంతి ఉన్నందున ఎన్నికల తేదీ మార్చాలని కాంగ్రెస్, భాజపా, అకాలీదళ్ తదితర పార్టీలు కోరాయి. 


ఫిబ్రవరి 16న రవిదాస్ జయంతి. ఈ సందర్భంగా లక్షలాది మంది పంజాబీలు ఉత్తర్​ప్రదేశ్ వారణాసికి వెళ్తుంటారు. ఫిబ్రవరి 14న ఎన్నికలు నిర్వహిస్తే చాలా మంది తమ ఓటు హక్కును ఉపయోగించుకునే అవకాశం ఉండదని రాజకీయ పార్టీలు పేర్కొన్నాయి.


ఈ ఎన్నికల్లో


పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా, కెప్టెన్ అమరీందర్ సింగ్ పార్టీ కలిసి పోటీ చేస్తున్నాయి. మొత్తం 117 స్థానాలకు గాను భాజపా 65 చోట్ల పోటీ చేయనుండగా, అమరీందర్ సింగ్ పార్టీ 37 స్థానాల్లో బరిలోకి దిగనుంది. శిరోమణి అకాలీ దళ్(సంయుక్త్‌)కు 15 సీట్లు కేటాయించారు. 


మరోవైపు అధికార కాంగ్రెస్.. సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ నేతృత్వంలో ఈ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూతో తీవ్ర పోటీ ఉన్నప్పటికీ సీఎం అభ్యర్థిగా చన్నీనే ఎంపిక చేసింది కాంగ్రెస్ అధిష్ఠానం.


Also Read: Viral: చెత్త ఏరుకునే ఈ వ్యక్తి హ్యాండ్సమ్ మోడల్‌లా ఎలా మారాడో చూడండి


Also Read: Bappi Lahiri: బప్పి లహిరి మెడలో అంత బంగారమెందుకు? వాటి బరువు, ధర ఎంతో తెలుసా?