పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతోన్న వేళ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ.. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కలులుగంటున్నారని లుధియానాలో జరిగిన ర్యాలీలో అమిత్ షా అన్నారు.
భారత ప్రధాని పర్యటనకు సురక్షితమైన రూట్‌ను ఇవ్వలేని సీఎం.. పంజాబ్ మొత్తాన్ని భద్రంగా చూసుకోగలరా? కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని సీఎం చన్నీ కలలుగంటున్నారు. - అమిత్ షా, కేంద్ర హోంమంత్రి
కేజ్రీవాల్‌పై
ఆమ్‌ఆద్మీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై కూడా అమిత్ షా విమర్శలు గుప్పించారు. పంజాబ్ భద్రతను చూసుకునే సత్తా కేజ్రీవాల్‌కు లేదన్నారు.
భద్రతాపరమైన విషయాల గురించి కేజ్రీవాల్‌కు ఏం తెలీదు. కేజ్రీవాల్‌కు పంజాబ్‌లో అధికారమిస్తే తీవ్రవాదులకు స్వేచ్ఛ దొరికినట్లే. భాజపా నేతృత్వంలోని ఎన్‌డీఏ మాత్రమే పంజాబ్‌ను కాపాడగలదు. - అమిత్ షా, కేంద్ర హోంమంత్రి
డ్రగ్స్ రహితంగా
పంజాబ్‌ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడానికి భాజపా కట్టుబడి ఉందని అమిత్ షా అన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా మేం పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తున్నాం. 2020, 2021లో మేం పట్టుకున్న డ్రగ్స్.. పదేళ్లలో కూడా ఎవరూ పట్టుకోలేదు. మేం అధికారంలోకి వస్తే పంజాబ్‌లోని నాలుగు నగరాల్లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) కార్యాలయాలను ఏర్పాటు చేస్తాం. ప్రతి జిల్లాలోనూ ఓ కార్యదళాన్ని ఏర్పాటు చేస్తాం. మరోవైపు దిల్లీని మందులో ముంచేసిన కేజ్రీవాల్.. ఇక్కడకు వచ్చి పంజాబ్‌ను డ్రగ్స్ రహితంగా మారుస్తామంటున్నారు. వాళ్లు ఇది చేయగలరా? - అమిత్ షా, కేంద్ర హోంమంత్రి
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా.. అమరీందర్ సింగ్ నేతృత్వంలోని పంజాబ్ లోక్ కాంగ్రెస్, సుఖ్‌దేవ్ సింగ్ ధిండ్సా పార్టీ శిరోమణి అకాలీ దళ్ (సంయుక్త)తో కలిసి బరిలోకి దిగింది.
Also Read: Kerala Bus Owner: కరోనా దెబ్బకు విలవిల, బస్సులను కిలో రూ.45కు విక్రయించిన ఓనర్
Also Read: Madhya Pradesh: సొరంగం కూలిన ఘటనలో ఏడుగురు సురక్షితం- మరో ఇద్దరి కోసం ఆపరేషన్