Madhya Pradesh: సొరంగం కూలిన ఘటనలో ఏడుగురు సురక్షితం- మరో ఇద్దరి కోసం ఆపరేషన్

ABP Desam   |  Murali Krishna   |  13 Feb 2022 12:46 PM (IST)

మధ్యప్రదేశ్‌లో నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిన ఘటనలో ఏడుగురిని సురక్షితంగా కాపాడాయి సహాయక బృందాలు.

కూలిన సొరంగం

మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. కట్ని జిల్లాలోని స్లిమ్నాబాద్​లో నిర్మాణంలో ఉన్న బార్గీ కెనాల్​ ప్రాజెక్ట్​ సొరంగం కూలింది. శిథిలాల కింద 9 మంది కార్మికులు చిక్కుకున్నారు. ఇందులో ఏడుగురిని కాపాడినట్లు అధికారులు తెలిపారు. ఎస్​డీఈఆర్​ఎఫ్​ బృందాలు సహాయ చర్యలను వేగవంతం చేశాయి.

రెస్కూ ఆపరేషన్​ ఇంకా కొనసాగుతుంది. కట్ని జిల్లాలోని స్లిమ్నాబాద్​లో నిర్మాణంలో ఉన్న బార్గీ కెనాల్​ ప్రాజెక్ట్​ సొరంగం కూలి శనివారం రాత్రి ప్రమాదం జరిగింది. శిథిలాల కింద సుమారు 9 మంది కార్మికులు చిక్కుకున్నారు. వీరిలో ఏడుగురిని ఇప్పటివరకు సురక్షితంగా రక్షించారు. మిగిలిన ఇద్దరి కోసం గాలింపు వేగవతం చేశాం.                                               - ప్రియాంక్, కట్ని కలెక్టర్​ 

సీఎం

ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్​ చౌహాన్ జిల్లా అధికార యంత్రాంగంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నట్లు అధికారులు తెలిపారు. కట్ని కలెక్టర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు సీఎం. బాధితులకు అవసరం అయిన చికిత్సను అందించాలని సూచించారు.

ప్రమాదం ఇలా

భూగర్భ సొరంగం నిర్మాణ పనులు చేస్తోన్న సమయంలో 70 అడుగుల లోతుకు కూలీలు తవ్వారు. ఈ క్రమంలో మట్టి ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో కార్మికులు ఇందులో చిక్కుకుపోయారు. వెంటనే రంగంలోకి దిగిన రాష్ట్ర విపత్తు స్పందన దళం.. ఆపరేషన్ వేగవంతం చేసింది. దీంతో ఏడుగురు కూలీలను ప్రాణాలతో కాపడగలిగారు. మరో ఇద్దరికి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Also Read: Talking on Phone While Driving: ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయవచ్చు, ఏ చలానాలు విధించరు !

Also Read: PM Modi: ప్రధాని మోదీ పర్యటనలో భద్రతాలోపం, అంబులైన్స్ లో వైద్యులు మిస్సింగ్!

Published at: 13 Feb 2022 12:44 PM (IST)
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.