మణిపుర్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం రీషెడ్యూల్ చేసింది. ఫిబ్రవరి 27న జరగాల్సిన తొలి విడత పోలింగ్‌ను ఫిబ్రవరి 28కి షెడ్యూల్ చేసింది.






మార్చి 3న జరగాల్సిన రెండో విడత ఎన్నికలను మార్చి 5కు రీషెడ్యూల్ చేసింది. 60 అసెంబ్లీ స్థానాలున్న మణిపుర్‌కు రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.


కేంద్ర ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర తన బృందంతో సహా ఈ వారం మొదట్లో మణిపుర్ వెళ్లారు. రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించి ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు.


పంజాబ్ కూడా..


పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను కూడా ఇటీవల వాయిదా వేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఫిబ్రవరి 20న ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. వివిధ  రాజకీయ పార్టీల డిమాండ్ మేరకు ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. గురు రవిదాస్ జయంతి ఉన్నందున ఎన్నికల తేదీ మార్చాలని కాంగ్రెస్, భాజపా, అకాలీదళ్ తదితర పార్టీలు కోరాయి. 


కొత్త షెడ్యూల్..






  • నోటిఫికేషన్ తేదీ: January 25, 2022 (మంగళవారం)

  • నామినేషన్ దాఖలుకు చివరి తేదీ: February 1, 2022 (మంగళవారం)

  • నామపత్రాల పరిశీలన: February 2, 2022 (బుధవారం)

  • నామపత్రాల ఉపసంహరణకు చివరి తేదీ: February 4, 2022 ( శుక్రవారం)

  • పోలింగ్ తేదీ: February 20, 2022 ( ఆదివారం)

  • ఓట్ల లెక్కింపు: March 10, 2022 ( గురువారం)





ఎందుకంటే?


ఫిబ్రవరి 16న రవిదాస్ జయంతి ఉంది. ఈ సందర్భంగా లక్షలాది మంది పంజాబీలు ఉత్తర్​ప్రదేశ్ వారణాసికి వెళ్తుంటారు. ఫిబ్రవరి 14న ఎన్నికలు నిర్వహిస్తే చాలా మంది తమ ఓటు హక్కును ఉపయోగించుకునే అవకాశం ఉండదని రాజకీయ పార్టీలు పేర్కొన్నాయి.


Also Read: Owaisi On Hijab Row: 'నేను టోపీతో పార్లమెంటుకు వెళ్లినప్పుడు- వాళ్లు హిజాబ్‌తో కళాశాలకు ఎందుకు వెళ్లకూడదు?'


Also Read: Karnataka Hijab Row: 'హిజాబ్' కేసు అత్యవసర బదిలీకి సుప్రీం నో- జోక్యం చేసుకోబోమని వ్యాఖ్య