Malkajgiri Lok Sabha Elections 2024: 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గం హుజూరాబాద్‌లో ఓటమి పాలైన బీజేపీ నేత ఈటల రాజేందర్ తాజాగా మల్కాజ్ గిరి నుంచి ఘనమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. అతి పెద్ద నియోజకవర్గం అయిన మల్కాజ్ గిరిలో ఏకంగా ఆయనకు 9,80,712 ఓట్లు పోలయ్యాయి. సమీప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్ రెడ్డిపై 387375 ఓట్ల మెజారిటీ సాధించారు. 


రెండో స్థానంలో  కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్ రెడ్డి నిలవగా.. ఈమెకు 5,93,337 ఓట్లు వచ్చాయి. మూడో స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఉన్నారు. ఈయనకు మల్కాజ్ గిరిలో 2,98,697  ఓట్లు వచ్చాయి. ఈ నియోజకవర్గంలో నోటాకు 13,206 ఓట్లు పడ్డాయి. 




తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ జోరుగా ఉన్నాయి. దేశంలోనే అతి పెద్దైన మల్కాజ్ గిరి లోక్ సభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తొలి నుంచి ముందంజలోనే కొనసాగారు. ఉదయం 11.30 గంటల సమయానికి ఈయనకు 6,23,372  ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్ రెడ్డి 256496 ఓట్ల తేడాతో వెనుకబడి ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మా రెడ్డి 425036 ఓట్ల తేడాతో మూడో స్థానానికి పరిమితం అయ్యారు. తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో ఎక్కడా బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో కనిపించలేదు. ప్రతి చోటా మూడో స్థానంలోనే ఉంటూ వచ్చింది.