AP Assembly Election Results 2024: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపులో కూటమి సునామీ రేపుతోంది. టీడీపీ, జనసేన నేతలు భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్నారు. ఆ కూటమి ప్రభంజనంలో వైసీపీ అభ్యర్థులు కొట్టుకుపోయినట్లుగా విశ్లేషణలు వస్తున్నాయి. ఉదయం 10.30 గంటల సమయానికి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో కూటమి అభ్యర్థులు ప్రత్యర్థులను ఊడ్చేస్తున్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాయలసీమలోనూ కూటమి జోరు ప్రదర్శిస్తోంది. మరోవైపు, ఉభయగోదావరిలోనూ టీడీపీ, జనసేన అభ్యర్థులు దూసుకుపోతున్నారు. ఇటు దక్షిణ కోస్తాలోనూ సైకిల్ జోరు మామూలుగా లేదు. 


మరోవైపు, ఫ్యాన్ మాత్రం చతికిల పడింది. ఒకరిద్దరు మినహా మంత్రులు అందరూ ఓటమి బాటలోనే ఉన్నారు. సీఎం సొంత జిల్లాలోనూ కూటమి గట్టి పోటీ ఇస్తుంది. వెనుకంజలో వైసీపీ మంత్రులు చాలా మంది ఉండగా.. హోంమంత్రి తానేటి వనిత, ఆర్థికమంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్, ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, బొత్స, రోజా, అంబటి రాంబాబు, విడదల రజని, ఉషశ్రీ చరణ, గుడివాడ అమర్నాథ్, కొట్టు సత్యనారాయణ, దాడిశెట్టి రాజా, విశ్వరూప్ తదితరులు అందరూ వెనుకంజలోనే కొనసాగుతున్నారు.


కడప లోక్ సభలో వైఎస్ అవినాష్ ముందంజ
కడప ఎంపీ బరిలో లక్షా 4వేల ఓట్ల మెజారిటీలో వైఎస్ అవినాష్ రెడ్డి కొనసాగుతున్నారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న వైఎస్ షర్మిల మూడో స్థానానికి పరిమితం అయ్యారు. షర్మిల సాధించిన ఓట్లు ఇప్పటివరకూ 14వేల 532ఓట్లు.



  • పిఠాపురంలో పవన్ కల్యాణ్‌ ముందంజ, 19,144 ఓట్ల ఆధిక్యంలో పవన్‌కల్యాణ్‌

  • బాపట్ల అసెంబ్లీ: 5వ రౌండ్ కి టిడిపి అభ్యర్థి నరేంద్ర వర్మకు 9797 మెజార్టీ

  • మాచర్ల టీడీపీ  అభ్యర్థి బ్రహ్మ రెడ్డి నాలుగో రౌండ్ లో 5432 అధిక్యం ..

  • పామర్రు రెండో రౌండు కైలే అనీల్ పై 2403 ఓట్లతో టిడిపి అభ్యర్ధి వర్ల కుమార్ రాజా లీడింగ్..

  • గన్నవరం రెండో రౌండు ముగిసే సరికి వల్లభనేని వంశీ పై టిడిపి అభ్యర్ధి యార్లగడ్డ వెంకట్రావు 4412 ఓట్ల ఆధిక్యం

  • కళ్యాణదుర్గం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి అమిలి సురేంద్ర బాబు మూడో రౌండ్ లో 7072 వేలతో ముందంజ

  • విశాఖ నార్త్ లో రెండో రౌండ్ ముగిసే సరికి 10వేల 328 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ విష్ణుకుమార్ రాజు. 516 ఓట్లు ఇప్పటివరకూ సాధించిన జేడీ లక్ష్మీనారాయణ

  • కృష్ణాజిల్లా గుడివాడ టీడీపీ అభ్యర్థి వెనిగళ్ళ రాము మూడో రౌండ్ పూర్తి సరికి ఓట్ల ఆధిక్యం 5345, కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన కొడాలి నాని


  • విజయవాడ తూర్పు నియోజకవర్గం నాలుగో రౌండులో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ 5298 ఓట్లతో మెజారిటీ


     




  • ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏకంగా 10 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్న టీడీపీ కూటమి అభ్యర్థులు


     




  • కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూటమి అభ్యర్థుల ముందంజ


     




  • విజయవాడ ఎంపీ స్థానంలో అన్న కేశినేని శ్రీనివాస్ పై 31వేల 574 ఓట్ల ఆధిక్యంలో తమ్ముడు కేశినేని చిన్న