Guntur Constituency MLA Winner List 2024: రాజకీయంగా చాలా చైతన్యవంతమైన గుంటూరు జిల్లా ఫలితం ఎప్పుడూ ప్రత్యేకమే. ఈసారి అన్ని పార్టీలు ఊహించని పేర్లను తెరపైకి తీసుకొచ్చాయి. అన్నింటిని తట్టుకొని కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. గుంటూరు మొత్తాన్ని ఊడ్చి పడేసింది.
|
నియోజకవర్గం |
విేజేత |
1 |
తాడికొండ |
తెనాలి శ్రవణ్ కుమార్ |
2 |
మంగళగిరి |
నారా లోకష్ |
3 |
పొన్నూరు |
ధూళిపాళ్ల నరేంద్ర |
4 |
తెనాలి |
నాదెండ్ల మనోహర్ |
5 |
ప్రత్తిపాడు |
వరుపుల సత్యప్రభ |
6 |
గుంటూరు ఈస్ట్ |
మహ్మద్ నజీర్ |
7 |
గుంటూరు వెస్ట్ |
పిడుగురాళ్ల మాధవి |
తెలుగుదేశం పార్టీకి పూర్తి పట్టున్న గుంటూరు(Guntur) జిల్లాలో వైఎస్‌ఆర్ ప్రభావం చూపారు. పాదయాత్రతో జిల్లా ఓటర్లను ఆకర్షించారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్(Congress)కు విజయం సాధించిపెట్టిన వైఎస్‌ఆర్....2009లోనూ హవా కొనసాగించారు. ఒక్క పొన్నూరు మినహా మిగిలిన సీట్లన్నీ కాంగ్రెస్ వశమయ్యాయి.
రాష్ట్ర విభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పూర్తిగా చచ్చిపోయింది. జనసేన, బీజేపీతో కలిసి బరిలో దిగిన తెలుగుదేశం(Telugudesam)..విజయఢంకా మోగించింది. ఐదు సీట్లలో విజయం సాధించింది. కొత్తగా బరిలో దిగిన వైసీపీ(YCP) రెండుచోట్ల గెలిచి ఉనికి చాటుకుంది. అమరావతి(Amaravathi) మహానగరాన్ని సృష్టించి వేలకోట్లు పెట్టుబడితో కొత్తరాజధాని నగరం నిర్మాణం ప్రారంభించడమేగాక...జిల్లాలో ఒక్కసారిగా రియల్ భూం తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీకి ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో చావుదెబ్బతగిలింది. రాజధాని ప్రజలు ఆ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించారు.
ఏకంగా చంద్రబాబు తనయుడు మంత్రి లోకేశ్(Lokesh) సైతం మంగళగిరి(Mangalagiri)లో ఓడిపోయారు. రాజధాని నియోజకవర్గం తాడికొండలోనూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవలేకపోయారు. ఒక్క గుంటూరు వెస్ట్ మినహా మిగిలిన సీట్లన్నీ వైసీపీ వశమయయ్యాయి. ఓటమి ఎరుగుని ధూళిపాళ్ల నరేంద్ర సైతం ఈఎన్నికల్లో ఓటమి రుచిచూశారు. గుంటూరు ప్రజల నాడి ఎవరికి అందదని చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత గెలిచిన ఒక్క తెలుగుదేశం ఎమ్మెల్యే సైతం అధికారపార్టీ పంచన చేరడంతో జిల్లాలో తెలుగుదేశానికి ప్రాతనిధ్యమే లేకుండా పోయింది. అయితే అనూహ్యంగా ఎంపీసీటు మాత్రం తెలుగుదేశం పార్టీ గెలుచుకోవడం విశేషం. గత ఎన్నికల కన్నా ఈసారి జిల్లాలో ఓటింగ్ శాతం తగ్గిపోయింది. క్రితం సారి 79.39శాతం ఓట్లు పోలవ్వగా...ఈసారి 78.81శాతమే ఓటింగ్ జరిగింది.
గుంటూరు జిల్లా
|
2009 |
2014 |
2019 |
తాడికొండ |
కాంగ్రెస్ |
టీడీపీ |
వైసీపీ |
మంగళగిరి |
కాంగ్రెస్ |
వైసీపీ |
వైసీపీ |
పొన్నూరు |
టీడీపీ |
టీడీపీ |
వైసీపీ |
తెనాలి |
కాంగ్రెస్ |
టీడీపీ |
వైసీపీ |
ప్రత్తిపాడు |
కాంగ్రెస్ |
టీడీపీ |
వైసీపీ |
గుంటూరు ఈస్ట్ |
కాంగ్రెస్ |
వైసీపీ |
వైసీపీ |
గుంటూరు వెస్ట్ |
టీడీపీ |