Mahabubabad Lok Sabha Elections 2024: మహబూబాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి బలరామ్ నాయక్ ఘన విజయం సాధించారు. ఈయన సమీప ప్రత్యర్థి అయిన బీఆర్ఎస్ అభ్యర్థి మాలోతు కవితపై 349165 ఓట్ల భారీ మెజారిటీ సాధించారు. బలరామ్ నాయక్ కు 612774  ఓట్లు పోలయ్యాయి. మాలోతు కవితకు 263609  ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి అజ్మీరా సీతారామ్ నాయక్ కు 110444 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో బీజేపీ పార్టీ మహబూబాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో మూడో స్థానానికి పరిమితం అయింది. తెలంగాణలో ఎక్కడా బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో కనిపించకపోవడం ఆ పార్టీ శ్రేణులను నిరాశకు గురి చేసింది. మొత్తానికి తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటును కూడా గెలవలేకపోయింది.


తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ జోరుగా ఉన్నాయి. మహబూబాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి బలరామ్ నాయక్ పోరిక తొలి నుంచి ముందంజలో కొనసాగారు. ఉదయం 11 గంటల సమయానికి ఈయనకు 495940 ఓట్లు రాగా.. బీఆర్ఎస్ అభ్యర్థి మాలోత్ కవిత 284897 ఓట్ల తేడాతో వెనుకబడి ఉన్నారు. బీజేపీ అభ్యర్థి అజ్మీరా సీతారామ్ నాయక్ 406433 ఓట్ల తేడాతో మూడో స్థానానికి పరిమితం అయ్యారు. తెలంగాణ లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ లో ఇక్కడ మాత్రమే బీఆర్ఎస్ పార్టీ రెండో స్థానంలో ఉంది.