Interesting Facts of English Alphabets:  క్రీ.పూ. 3 వ శతాబ్దంలో డాట్ లేదా ఫుల్ స్టాప్ ను గ్రీకుకు చెందిన అరిస్టోఫేనెస్ కనిపెట్టాడు. దీని ఉపయోగాన్ని మూడు చోట్ల విడివిడిగా విభజించారు. కానీ కాలానుక్రమంలో ఒక డాట్ మాత్రమే ఫుల్ స్టాప్ గా వాడుతూ, మిగిలిన రెండు చోట్ల కామా(,), సెమీ కోలన్ (;)గా ఇవి రూపాంతరం చెందాయి. కానీ చుక్క (.) వాడకం మాత్రం అన్ని భాషల్లోనూ, వేర్వేరు సందర్భాల్లో వేర్వేరుగా వాడటం మనం గమనించవచ్చు.


ఇంగ్లిష్ వర్ణమాలలోని i మరియు j అక్షరాల పైన ఒక చుక్క ఉంది. దీనిని సాధారణ పరిభాషలో 'బిందీ' అని కూడా అంటారు. అయితే ఈ చుక్కని అసలు ఏమంటారో తెలుసా? స్కూల్లో చదువు ఏ అక్షరాలతో ప్రారంభమవుతుంది? చాలా మంది దీనికి a,b,c,d అని సమాధానం ఇస్తారు. అయితే వర్ణమాలలోని i మరియు j అక్షరాల పైన చుక్క ఎందుకు ఉందో తెలుసా? మరియు ఈ చుక్కని ఏమంటారు?  i మరియు j లపై చుక్క ఎందుకు ఉందో తెలుసుకుందాం.


ఈ అక్షరాలు రాయాలంటే పెన్ను ఎత్తాలి


i మరియు j  రాసేటపుడు మీరు గమనించే ఉంటారు. పెన్ను ఎత్తకుండా ఈ అక్షరాలు రాయలేము. ఎందుకంటే,  i మరియు j పైన చుక్క పెట్టాలి.


ఈ చుక్క అసలు పేరు ఏమిటి?


ఇంగ్లిష్ వర్ణమాలలోని i మరియు j అక్షరాలపై చుక్కలు ఉన్నాయని మీరు చిన్నపుడే గమనించి ఉంటారు. కానీ నిజానికి వాటిని చుక్కలు అని పిలవరని ఎవరూ చెప్పి ఉండరు కదూ!  i మరియు j అక్షరాల పైన ఉన్న చుక్కను 'టైటిల్' అంటారు. ఇది 'గ్లిఫ్' అని కూడా పిలువబడుతుంది. ఈ 'గ్లిఫ్‌ 'తో ఏదైనా ఇతర భాషలోని అక్షరం యొక్క అర్థం మారుతుంది. అయితే, ఇంగ్లీషులో మాత్రం i మరియు j ల అర్థం మారదు.


ఈ చుక్కలు ఎందుకు ఉంచబడ్డాయి?


డాట్ (DOT) గ్రీకు భాష నుండి వచ్చింది. మొదట ఈ డాట్(DoT) లు మూడు రకాలుగా ఉండేవి. లో డాట్(Low dot), మిడ్ డాట్(middot), హై డాట్(high dot). ఇవే తర్వాత ఫుల్ స్టాప్(.), కామా(,), సెమీ కోలన్(;) గా మార్చబడాయి.లాటిన్‌లో డాట్‌ని 'టైటులస్' అంటారు. అంటే.. శీర్షిక(Title). సబ్జెక్ట్‌ను లాటిన్ మాన్యుస్క్రిప్ట్‌లో వ్రాస్తున్నప్పుడు, చుట్టుపక్కల పదాలను i మరియు j నుండి వేరు చేయడానికి వాటిపై చుక్క ఉంచబడింది.


ప్రతి భాషలో వేర్వేరు అర్థాలు ఉన్నాయి


క్రీ.పూ. 3 వ శతాబ్దంలో ఈ డాట్(DOT) కనిపెట్టబడింది. ప్రతీ భాషలోని అక్షరాలకు చుక్కలుంటాయి. కానీ, వాటిని ఉపయోగించే తీరు, వాటి అర్థాలు, ఆ చుక్కకు గల పేరు భాషను బట్టి వేర్వేరుగా మారుతూ ఉంటాయి. అయితే, ఏ భాషలోనైనా ఈ డాట్ వచ్చిన సందర్భాన్ని బట్టి అర్థం మారుతుంటుంది. కానీ ఇంగ్లిష్ భాషలో మాత్రం i మరియు j లు ఎక్కడ వచ్చినా వాటిపైన ఉంచిన చుక్క యొక్క అర్థంలో మార్పు ఉండదు.. ఇదే వీటి ప్రత్యేకత.