Kesineni Chinni Comments: రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయఢంకా మోగించడం ఖాయం అని టీడీపీ నేత కేశినేని చిన్ని అన్నారు. కూటమికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. వైసీపీ అరాచక పాలనతో ప్రజలు విసిగిపోయారని.. విజయవాడ పార్లమెంటులో ఏడు నియోజకవర్గాలు క్లిన్ స్వీప్ చేస్తామని అన్నారు. తాను ఎంపీ అభ్యర్థిగా 3 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుస్తామని అన్నారు. రాష్ట్రంలో వైసీపీ అరాచకాలు పెరిగిపోయాయని విమర్శించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఇవే చివరి ఎన్నికలు అని అన్నారు.


జగన్ మోహన్ రెడ్డికి ఇవే చివరి ఎన్నికలు అని అన్నారు. రాజకీయాల నుంచి జగన్ ను శాశ్వతంగా ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. ‘‘చంద్రబాబు మంచోడు.. లోకేష్ అంత మంచోడు కాదు. రెడ్ బుక్ లో పరిధిదాటి వ్యవహరిస్తున్న అధికారుల పేర్లు ఉన్నాయి’’ అని కేశినేని చిన్ని అన్నారు. ప్రభుత్వానికి కొమ్ముకాసే అధికారులకు చిన్ని వార్నింగ్ ఇచ్చారు. రెడ్ బుక్‌లో పరిధి దాటి వ్యవహరిస్తున్న అధికారుల పేర్లు ఉన్నాయని హెచ్చరించారు.