యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) జాతీయ అర్హత పరీక్ష 2021 (నెట్) కోసం అప్లికేషన్ కరెక్షన్‌కు అవకాశం ఈ రోజు (సెప్టెంబరు 12)తో ముగియనుంది. ఇవాళ రాత్రి 12 గంటల నుంచి కరెక్షన్ విండో కనిపించబోదని, యూజీసీ నెట్ 2021 పరీక్ష నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది. సెప్టెంబరు 7 నుంచి దరఖాస్తుల కరెక్షన్‌కు అవకాశాన్ని ఇస్తున్నట్లు అప్పుడే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని ugcnet.nta.nic.in వెబ్ సైట్‌లో చూడొచ్చని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది.

Continues below advertisement


నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసిన అధికారిక సమాచారం ప్రకారం.. గడువు దాటిన తర్వాత దరఖాస్తుల కరెక్షన్‌కు ఎలాంటి వినతులు స్వీకరించబోమని స్పష్టం చేసింది. ఒకవేళ ఏవైనా మార్పులు చేయాలనుకుంటే దానికి సంబంధిత నిర్దేశించిన అదనపు ఫీజును ఇవాళే చెల్లించుకొని కరెక్షన్ చేసుకోవచ్చని సూచించింది. అభ్యర్థులు ఈ ఫీజును క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు లేదా యూపీఐ ద్వారా రకరకాలుగా చెల్లించవచ్చునని సూచించింది.


ఈ ఏడాది జూన్ 2021లో జరగాల్సిన యూజీసీ నెట్ 2021 పరీక్ష కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. కరోనా తాజాగా తగ్గుముఖం పట్టడంతో తాజాగా నిర్వహిస్తున్నారు.


ముఖ్యమైన తేదీలు
* యూజీసీ నెట్ మార్పులకు చివరి తేదీ: సెప్టెంబరు 12, 2021 అర్ధరాత్రి 11.59 గంటల వరకూ


* యూజీసీ నెట్ 2021 పరీక్ష తేదీ: అక్టోబరు 6 నుంచి 8వ తేదీ మరియు అక్టోబరు 17 నుంచి 19 తేదీ వరకూ


ఇవాళ ముగిసిన నీట్ పరీక్ష


మరోవైపు, నేష‌న‌ల్ ఎలిజిబిలిటీ క‌మ్ ఎంట్రెన్స్ టెస్ట్ 2021 పరీక్ష ఇవాళ జరిగిన సంగతి తెలిసిందే. ఆన్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహించారు. ఈ మేరకు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ (ఎన్‌బీఈ) వెల్లడించింది. నీట్ యూజీ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీలు, యూనివర్సిటీలలో ఎండీ, ఎంఎస్, పోస్టు గ్రాడ్యుయేషన్ డిప్లొమా కోర్సులలో చేరవచ్చు. ఎయిమ్స్, పీజీఐఎంఈఆర్ (PGIMER), NIMHANS, SCTIMST, JIPMER తప్ప మిగతా అన్ని మెడికల్ కాలేజీలు, వర్సిటీలలో ప్రవేశాలు పొందవచ్చు.


Also Read: జొమాటో షాకింగ్ నిర్ణయం.. ఇక ఆ సర్వీసులు బంద్, కారణం ఏంటంటే..


Also Read: Tankbund: ఈ ఆదివారం నుంచి ట్యాంక్ బండ్‌పై మరిన్ని సర్‌ప్రైజ్‌లు.. ఫుల్ ఖుషీలో నగర వాసులు


Also Read: Bandi Sanjay: మీకు సోయే లేదు, అది అమలు చేయాల్సిందే.. కేసీఆర్‌కు బండి సంజయ్ బహిరంగ లేఖ