యూజీసీ ఐదు రీసెర్చ్ గ్రాంట్లు,ఫెలోషిప్‌లకు దరఖాస్తులు కోరుతుంది. దీని ద్వారా పరిశోధక విద్యార్థులు, అధ్యాపకులు, రిటైర్డ్ ఫ్యాకల్టీ, ఒంటరి ఆడపిల్లలు, న్యూలీ రిక్రూటెడ్‌ ఫ్యాకల్టీ అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చని యూజీసీ తెలిపింది. ఆసక్తి గల అభ్యర్ధులు అక్టోబర్ 10లోపు దరఖాస్తుచేసుకోవాల్సి ఉంటుంది.
వివరాలు..
➥ ఇన్-సర్వీస్ ఫ్యాకల్టీ సభ్యుల కోసం రీసెర్చ్ గ్రాంట్
➥ కొత్తగా రిక్రూట్ చేయబడిన ఫ్యాకల్టీ సభ్యుల కోసం డాక్టర్ డీఎస్ కొఠారీ రీసెర్చ్ గ్రాంట్
➥ సూపర్‌యాన్యుయేటెడ్ ఫ్యాకల్టీ సభ్యులకు ఫెలోషిప్
➥ డాక్టర్ రాధాకృష్ణన్ యూజీసీ పోస్ట్-డాక్టోరల్ ఫెలోషిప్
➥ ఒంటరి ఆడపిల్లల కోసం సావిత్రీబాయి జ్యోతిరావు ఫూలే ఫెలోషిప్



ఐదు ఫెలోషిప్‌లు, రీసెర్చ్ గ్రాంట్ల వివరాలు..

1. ఇన్ సర్వీస్ ఫ్యాకల్టీ రీసెర్చ్ గ్రాంట్:
ఈ స్కీమ్ ద్వారా ఫ్యాకల్టీ మెంబర్లుగా అపాయింట్ అయిన వారికి పరిశోధనలపై అవకాశం ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకుంది. దీని ద్వారా 200 మంది ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్లపాటు రూ.10 లక్షల సహకారం అందుతుంది.

అర్హత:
అభ్యర్ధులు దరఖాస్తు సమర్పించే తేదీ నాటికి విశ్వవిద్యాలయంలో కనీసం 10 సంవత్సరాల సర్వీస్ కలిగి ఉండాలి. తప్పనిసరిగా జాతీయ/అంతర్జాతీయ ప్రభుత్వం లేదా ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా నిధులు సమకూర్చబడిన కనీసం 2 ప్రాయోజిత పరిశోధన ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసి ఉండాలి.

వయోపరిమితి:
అభ్యర్ధుల వయస్సు 50 ఏళ్ళు మించకూడదు.

2. డాక్టర్ డీఎస్ కొఠారీ రీసెర్చ్ గ్రాంట్:

కొత్తగా రిక్రూట్ చేయబడిన సైన్స్, మెడిసిన్, ఇంజినీరింగ్ విభాగాలకు చెందిన ఫ్యాకల్టీలకు పరిశోధన అవకాశాలను కల్పించే లక్ష్యంతో యూజీసీ ఈ స్కీమ్ ప్రవేశ పెట్టినది. దీని ద్వారా 132 మంది ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్లపాటు రూ.10 లక్షల సహకారం అందుతుంది.

అర్హత:
అసిస్టెంట్ ప్రొఫెసర్ పిహెచ్‌డితో పాటు కనీసం ఐదు పరిశోధన పత్రాలు అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురితమై ఉండాలి. విశ్వవిద్యాలయంలో శాశ్వత పోస్టుల స్థానంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయిలో కొత్తగా నియమితులైన ఉపాధ్యాయులందరూ ఈ స్కీమ్ కింద ఆర్థిక సహాయాన్ని పొందవొచ్చు. 

3. ఫెలోషిప్ ఫర్ సూపర్‌యాన్యుయేటెడ్ ఫ్యాకల్టీ మెంబర్స్:

పదవీ విరమణ చేసిన తర్వాత కూడా బోధనలో, పరిశోధనలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న ఉపాధ్యాయులకు పరిశోధన అవకాశాలను కల్పించే లక్ష్యంతో యూజీసీ ఈ స్కీమ్ ప్రవేశ పెట్టినది. దీనికి 100 సీట్లు అందుబాటులో ఉంటాయి. ఈ ఫెలోషిప్‌కు ఎంపికైన వారికి నెలకు రూ.50 వేలు, ఏడాదికి రూ.50 వేల చొప్పున మూడేళ్లు అందిస్తారు. 

అర్హత:
అభ్యర్థులు తప్పనిసరిగా ప్రధాన పరిశోధకుడిగా, జాతీయ/అంతర్జాతీయ ఏజెన్సీలచే నిధులు సమకూర్చబడిన కనీసం 3 ప్రాయోజిత పరిశోధన ప్రాజెక్టులను నిర్వహించాలి.

వయోపరిమితి:
67 సంవత్సరాల వరకు

4. డాక్టర్ రాధాకృష్ణన్ యూజీసీ పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్:

ఈ స్కీమ్ కింద 900 మంది అభ్యర్థులకు భారతీయ విశ్వవిద్యాలయాలు మరియు సంస్థలలోని భాషలతో సహా సైన్సెస్, ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీ, హ్యుమానిటీస్ మరియు సోషల్ సైన్సెస్‌లో అధునాతన అధ్యయనాలు మరియు పరిశోధనలను నిర్వహించడానికి అవకాశాన్ని అందిస్తుంది. అయితే, ఇందులో 30 శాతం మహిళా అభ్యర్థులకు మాత్రమే రిజర్వ్ చేసి ఉంచింది. ఈ ఫెలోషిప్‌కు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.50వేలు, ఏడాదికి రూ.50 వేల చొప్పున మూడేళ్లు అందిస్తారు. 

అర్హత:
సంబంధిత సబ్జెక్ట్/డిసిప్లైన్ ఆఫ్ సైన్సెస్, ఇంజినీరింగ్ మరియు టెక్నాలజీ, హ్యుమానిటీస్ మరియు సోషల్ సైన్సెస్ భాషలతో సహా డిగ్రీ ఉత్తీర్ణులైఉండాలి, డిగ్రీ ఇవ్వని పక్షంలో తాత్కాలిక సర్టిఫికేట్ ఉపయోగపడుతుంది. ఇప్పటికే రెగ్యులర్ సర్వీస్‌లో ఉన్న అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కాదు.ఎంపికైన అభ్యర్థి ఏదైనా ఇతర ఫెలోషిప్/వేతనం పొందుతున్నట్లయితే వారికి ఈ స్కీమ్ వర్తించదు. జనరల్ కేటగిరీ అభ్యర్థులు కనీసం 55% మార్కులు లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలో CGPA స్కోర్, తత్సమాన శాతాన్ని కలిగి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎస్సీ,ఎస్టీ,ఓబీసీ,దివ్యాంగులు మరియు ట్రాన్స్‌జెండర్లకు 5% మార్కుల సడలింపు వర్తిస్తుంది.

వయోపరిమితి:
ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించే చివరి తేదీ నాటికి జనరల్ కేటగిరీ అభ్యర్థులు 35 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగి ఉండాలి. (దరఖాస్తు తేదీ/చివరి తేదీ నాటికి). ఎస్సీ,ఎస్టీ,ఓబీసీ,మహిళలు,దివ్యాంగులు మరియు ట్రాన్స్‌జెండర్లకు 5 సంవత్సరాల పాటు వయో సడలింపు ఉంటుంది.

5. సింగిల్ గర్ల్ చైల్డ్‌ కోసం సావిత్రిబాయి జోతిరావ్ ఫూలే ఫెలోషిప్:

ఈ ఫెలో షిప్ ఎంతమందికి అందించాలనే నిబంధన ఏమీ లేదు. సింగిల్ గర్ల్స్‌ను ఎంకరేజ్ చేయడానికి యూజీసీ ఈ స్కీం ప్రవేశ పెట్టినది. వారు తమ చదువులు, పరిశోధనలు కొనసాగించి అంతిమంగా అవి వారి పీహెచ్‌డీకి ఉపయోగపడేలా చేయాలని యోచిస్తున్నది.


అర్హత: పిహెచ్‌డి చదువుతున్న ఏ ఒక్క ఆడపిల్ల అయినా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాలు/కళాశాలలు/సంస్థల్లోని ఏదైనా స్ట్రీమ్/సబ్జెక్ట్‌లో ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రెగ్యులర్, ఫుల్‌టైమ్ పిహెచ్‌డి ప్రోగ్రామ్‌లో నమోదు చేసుకున్న వారికి ఈ పథకం వర్తిస్తుంది. పిహెచ్‌డి పార్ట్-టైమ్/డిస్టెన్స్‌లో చేసేవారికి  ఈ పథకం వర్తించదు.

వయోపరిమితి
: ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించే చివరి తేదీ నాటికి జనరల్ కేటగిరీకి అభ్యర్ధులకు 40 ఏళ్లు మరియు ఎస్సీ,ఎస్టీ,ఓబీసీ,దివ్యాంగులకు 45 ఏళ్లు ఉండాలి.

దరఖాస్తుల విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక ప్రక్రియ:
యూజీసీ నిబంధనల ప్రకారం ఎంపికలు ఉంటాయి.

ముఖ్యమైన తేదీలు..

ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభతేదీ: 05.09.2022

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేదీ: 10.10.2022

Savitribai JP fellowship -Guidelines 


Guidelines for UGC Post Doctoral Fellowship Schemes 

Guidelines-Newly rectt faculty 


Guidelines-In service faculty 


Guidelines-Superannuated faculty


Website


Also Read:
'గేట్' తెరచుకుంది, దరఖాస్తు చేసుకోండి! చివరితేది ఎప్పుడో తెలుసా?

దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో పీజీ చదవాలన్నా, నేరుగా పీహెచ్‌డీ చేయాలన్నా.. 'గేట్' అర్హత ఉండాల్సిందే. గేట్‌లో వచ్చే స్కోరు ఆధారంగానే ఐఐటీలు, ఎన్ఐటీలు, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్, యూనివర్సిటీలు, ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలల్లో ఇంజినీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, ఫార్మసీ విభాగాల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ క్రమంలోనే ఐఐటీ కాన్పూర్ జులై 27న 'గేట్-2023' నోటిఫికేషన్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. గేట్-2023 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తయిన, చివరి సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 
నోటిఫికేషన్‌ తదితర వివరాల కోసం క్లిక్ చేయండి

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..