Telangana Inter Results 2022: తెలంగాణ ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్ ఫలితాలను నేటి ఉదయం పదకొండు గంటలకు విడుదల చేశారు. తెలంగాణ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు (TS Inter Results 2022) ఉదయం 11 గంటలకు విడుదల చేశారు. కొన్ని రోజుల కిందట విడుదల చేయాలనుకున్న ఫలితాలు కాస్త ఆలస్యంగా నేడు విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డ్ కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ ఇటీవల తెలిపారు. తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షల ఫలితాలు ఒకేసారి విడుదల కానున్నాయి. విద్యార్థులు ఫలితాలను telugu.abplive.com, tsbie.cgg.gov.in వెబ్ సైట్స్‌లో చెక్ చేసుకోవచ్చు.
ఫస్టియర్‌లో 63,32 శాతం.. సెకండియర్‌లో 67.16 శాతం పాస్
విద్యార్థులు ఒత్తిడికి లోనుకావొద్దని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. జేఈఈ మెయిన్స్ పరీక్షల తేదీలు రావడంతో ఇంటర్ ఎగ్జామ్స్ రీషెడ్యూల్ చేశామన్నారు. ఇంటర్ ఫస్టియర్‌లో 63.32 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ సెకండియర్‌లో 67.16 శాతం మంది విద్యార్థులు పాసైనట్లు మంత్రి సబిత వెల్లడించారు. ఫస్టియర్‌లో అమ్మాయిలు 1,68,692 మంది పాస్ 72.30 శాతం, అబ్బాయిలు 1,25,686 మంది 54.20 శాతం పాస్ అయ్యారు.
ఇంటర్ ఫస్టియర్ రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
ఇంటర్ సెకండియర్ రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
9 లక్షల మంది ఇంటర్ విద్యార్థుల ఫలితాలు
కరోనా వ్యాప్తితో గత రెండేళ్లు పరీక్షల నిర్వహణకు ఆటంకాలు తలెత్తాయి. ఈ ఏడాది ఇంటర్ బోర్డ్ ప్రకారం తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ మే 6 నుంచి 23 వరకు నిర్వహించింది. ఇంటర్ సెంకడ్ ఇయర్ పరీక్షలను మే 7 నుంచి 24వ తేదీ వరకు జరిగాయి. ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు మొత్తం 9,07,396 మంది హాజరయ్యారు. ఇందులో ఫస్టియర్ పరీక్షలకు 4,64,626 మంది హాజరు కాగా, సెకండియర్ ఎగ్జామ్స్ 4,42,768 మంది రాశారు. మొత్తం 1,443 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసి పరీక్షలు పటిష్టంగా నిర్వహించారు. చెప్పిన సమయం ప్రకారం.. మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల చేశారు.
Also Read: TS Inter 2nd Year Results 2022: తెలంగాణ ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో దుమ్మురేపిన అమ్మాయిలు
Also Read: TS 1st Year Inter Results 2022: ఇంటర్ ఫస్టియర్‌లో 63.32 శాతం పాస్, ఈ సారి అమ్మాయిలదే పైచేయి