Telangana Inter 2nd Year Results 2022: తెలంగాణలో ఇంటర్ రిజల్ట్స్ నేడు విడుదల కానున్నాయి. నేడు (జూన్ 28న) ఇంటర్ సెకండియర్ ఫలితాలు ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్ ఫలితాలను నేటి ఉదయం పదకొండు గంటలకు విడుదల చేయనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డ్ కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ ఇటీవల తెలిపారు. తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షల ఫలితాలు ఒకేసారి విడుదల కానున్నాయి. విద్యార్థులు ఫలితాలను telugu.abplive.com, tsbie.cgg.gov.in  వెబ్ సైట్స్‌లో చెక్ చేసుకోవచ్చు. 


నాలుగున్నర లక్షల మంది ఫలితాలు..
ఇంటర్ సెంకడ్ ఇయర్ పరీక్షలను మే 7 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించారు. ఈ ఏడాది తెలంగాణలో ఇంటర్ పరీక్షలకు మొత్తం 9,07,396 మంది హాజరయ్యారు. సెకండియర్ పరీక్షలు 4,42,768 మంది రాశారు. మొత్తం 1,443 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసి 25 వేల మంది ఇన్విజిలేటర్లు, 150 మంది సిట్టింగ్ స్క్వాడ్, 75 మంది ఫ్లయింగ్ స్క్వాడ్‌లతో పరీక్షలు పటిష్టంగా నిర్వహించారు. తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నారు. ఇంటర్ సెకండియర్ రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి


గత ఏడాది కరోనా పాస్.. ఈసారి ఎగ్జామ్స్
కరోనా నేపథ్యంలో గత ఏడాది ఇంటర్ ఫస్టియర్ పరీక్షా ఫలితాల్లో 49 శాతం మాత్రమే పాసయ్యారు. పరిస్థితిని అర్థం చేసుకుని ఇంటర్ బోర్డ్, రాష్ట్ర విద్యాశాఖ చివరకు కనీస మార్కులతో అందరినీ పాస్ చేసింది. దాంతో 100 శాతం ఇంటర్ విద్యార్థులు పాసయ్యారు. ఇలాంటి పరిస్థితి మరోసారి రాకూడదని అధికారులు జాగ్రత్తలు తీసుకుని ఈ ఏడాది పరీక్షలు నిర్వహించారు. నేడు ఫలితాలు విడుదలయ్యాక కేవలం 15 రోజుల్లోనే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారు. తద్వారా ఇంజనీరింగ్ (BTech), ఎంబీబీఎస్ (MBBS), ఇతర కోర్సుల్లో ప్రవేశాలకు విద్యార్థులకు ఇబ్బంది తలెత్తకూడదని ఈ నిర్ణయం తీసుకున్నారు. 


Also Read: TS Inter Results 2022: నేడు తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల - రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే 


తెలంగాణ ఇంటర్ ఫలితాలు 2022 ఇలా చెక్ చేసుకోండి (Steps to check TS Inter Results 2022)
Step 1: తెలంగాణ ఇంటర్ విద్యార్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్  https://tsbie.cgg.gov.in సందర్శించండి
Step 2: హోం పేజీలో తెలంగాణ ఇంటర్ సెకండియర్ ఫలితాలు 2022 లింక్ (Telangana Inter Results 2022 link) మీద క్లిక్ చేయండి
Step 3: హాల్ టికెట్ నెంబర్ (రిజిస్ట్రేషన్ నెంబర్), పుట్టిన తేదీ లాంటి వివరాలు నమోదు చేయాలి
Step 4: ఇంటర్ విద్యార్థుల ఫస్టియర్ లేదా సెకండియర్ ఫలితాలు మీ స్క్రీన్ మీద కనిపిస్తాయి
Step 5:  రిజల్ట్స్‌ను విద్యార్థులు పీడీఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకోండి
Step 6: ఇంజినీరింగ్, మెడిసిన్, డిగ్రీల ప్రవేశాలు లాంటి భవిష్యత్ అవసరాల కోసం మీ ఫలితాలను ప్రింటౌట్ తీసుకోవడం మరిచిపోవద్దు


Also Read: AP Inter Supply Exam Date 2022: ఏపీ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ఇదే