కరోనా కారణంగా ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని విజయవంతంగా ఇంటర్ ఫలితాలు విడుదల చేశామన్నారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఇంటర్ ఫలితాలు విడుదల సందర్భంగా ఆమె మాట్లాడుతూ... గతేడాది ఎదుర్కున్న సమస్యలు తెలిపారు. అన్నింటినీ ఎదుర్కొని మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు సబితా ఇంద్రారెడ్డి. తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షల ఫలితాలు ఒకేసారి విడుదలయ్యాయి. విద్యార్థులు ఫలితాలను telugu.abplive.com, tsbie.cgg.gov.in వెబ్ సైట్స్‌లో చెక్ చేసుకోవచ్చు.
ఇంటర్ రెండో సంవత్సరంలో 4లక్షల63వేల 370 మంది రాస్తే... 2లక్షల 95వేల 949 మంది పాస్ అయ్యారని తెలిపారు మంత్రి సబిత. మొత్తంగా 67.82 శాతం పాస్ అయ్యారని పేర్కొన్నారు. ఇందులో ఏ గ్రేడ్‌లో లక్షా 59వేల 422 మంది పాస్ అయితే... B గ్రేడ్‌లో 82వేల 481 మంది పాస్ అయ్యారు.
ఇంటర్ సెకండ్ ఇయర్‌లో అమ్మాయిల పాస్ పర్సంటేజ్ ఎక్కువ ఉందని మంత్రి వివరించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలను 2లక్షల 16వేల 389 మంది రాస్తే... లక్షా 64 వేల 172 మంది పాస్ అయ్యారని పేర్కొన్నారు. 75.86శాతం మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు.
ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలను 2 లక్షల 19వేల 981 మంది రాస్తే... లక్షా 31వేల 277 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. అబ్బాయిల పాస్ పర్సంటేజ్ 60 శాతం. రెండో సంవత్సరంలో మేడ్చ్‌ల్ 78 శాతం పాస్‌తో మొదటి స్థానంలో ఉంటే.. 77శాతం పాస్ పర్సంటేజ్‌తో ఆసిఫాబాద్ రెండో స్థానంలో నిలిచింది.
ఫస్టియర్‌లో 2,94,378 మంది పాస్..
తెలంగాణలో ఈ ఏడాది మొత్తం 9,28,262 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. 5,90,327 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 4,64,892 మంది పరీక్షలు రాస్తే 2,94,378 మంది పాస్ అయ్యారు. అందులో ఏ గ్రేడ్ 1,93,925 మంది, 63,501 మంది బీ గ్రేడ్ సాధించారు. విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించేందుకు కౌన్సిలింగ్‌లు నిర్వహించినట్లు చెప్పారు. అయితే ఈ ఏడాది జేఈఈ పరీక్షలు, ఇతర కారణాలతో 2, 3సార్లు పరీక్షల షెడ్యూల్ మారటం వల్ల విద్యార్థులు కొంత ఇబ్బందిపడ్డారని సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. కరోనా కారణంగా గత రెండేళ్లు ఇబ్బందులు ఎదుర్కోవడంతో.. ఈ ఏడాది మొత్తం 1,443 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసి పరీక్షలు పటిష్టంగా నిర్వహించారు. ఇంటర్ ఫస్టియర్ రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి