TS 1st Year Inter Results 2022: తెలంగాణలో ఇంటర్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్‌లో 63.32 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాలలో అమ్మాయిలే పైచేయి సాధించారు.  ఫస్టియర్‌లో అమ్మాయిలు 1,68,692 మంది పాస్  72.30 శాతం, అబ్బాయిలు 1,25,686 మంది 54.20 శాతం పాస్ అయ్యారు. ఇంటర్ సెకండియర్‌లో  67.16 శాతం మంది విద్యార్థులు పాసైనట్లు మంత్రి సబిత వెల్లడించారు. విద్యార్థులు ఒత్తిడికి లోనుకావొద్దని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. జేఈఈ మెయిన్స్ పరీక్షల తేదీలు రావడంతో ఇంటర్ ఎగ్జామ్స్ రీషెడ్యూల్ చేశామన్నారు. తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షల ఫలితాలు ఒకేసారి విడుదల చేశారు. విద్యార్థులు ఫలితాలను telugu.abplive.com, tsbie.cgg.gov.in వెబ్ సైట్స్‌లో చెక్ చేసుకోవచ్చు.


ఫస్టియర్‌లో 2,94,378 మంది పాస్.. 
తెలంగాణలో ఈ ఏడాది మొత్తం 9,28,262 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. 5,90,327 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 4,64,892 మంది పరీక్షలు రాస్తే 2,94,378 మంది పాస్ అయ్యారు. అందులో ఏ గ్రేడ్ 1,93,925 మంది, 63,501 మంది బీ గ్రేడ్ సాధించారు. విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించేందుకు కౌన్సిలింగ్‌లు నిర్వహించినట్లు చెప్పారు. అయితే ఈ ఏడాది జేఈఈ పరీక్షలు, ఇతర కారణాలతో 2, 3సార్లు పరీక్షల షెడ్యూల్ మారటం వల్ల విద్యార్థులు కొంత ఇబ్బందిపడ్డారని సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. కరోనా కారణంగా గత రెండేళ్లు ఇబ్బందులు ఎదుర్కోవడంతో.. ఈ ఏడాది మొత్తం 1,443 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసి పరీక్షలు పటిష్టంగా నిర్వహించారు. ఇంటర్ ఫస్టియర్ రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి 


ఇంటర్ ఉత్తీర్ణత శాతంలో టాప్ జిల్లాలు ఇవే..
ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో జిల్లాల వారీగా చూస్తే మేడ్చల్ జిల్లా 76 శాతంతో మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో హన్మకొండలో 74 శాతం మంది పాసయ్యారు. ఇక సెకండ్ ఇయర్ ఫలితాల్లో మేడ్చల్ 78 శాతంతో తొలిస్థానంలో ఉండగా, రెండో స్థానంలో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా (77 శాతం) ఉంది.


ఇంటర్ సెకండియర్ రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి 


జూన్ 30 నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. ఆగస్టు 1వ తేదీ నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభించనున్నామని మంత్రి చెప్పారు. ఇదే విధంగా ఆగస్టు నెలాఖరులోగా అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు సైతం వెల్లడించే దిశగా చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి పేర్కొన్నారు.


Also Read: Telangana Inter Results 2022: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి సబితా - రిజల్ట్స్ కోసం డైరెక్ట్ లింక్