తెలంగాణలో బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎడ్‌సెట్ )- 2021 పరీక్షలు ఈరోజు నుంచి (ఆగస్టు 24) ప్రారంభం కానున్నాయి. బుధవారం (ఆగస్టు 25) కూడా ఈ పరీక్షలు జరగనున్నాయి. వీటి ద్వారా 2021 - 22 విద్యా సంవత్సరానికి గానూ ప్రవేశాలు చేపట్టనున్నారు. మొత్తం రెండు సెషన్లలో పరీక్షలను నిర్వహిస్తారు. పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలోనే పరీక్షలు జరగనున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ ఈ పరీక్షలను నిర్వహిస్తోంది.


మొదటి సెషన్ ఉదయం 10 నుంచి 12 గంటల వరకు.. రెండో సెషన్ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. ఈ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 48 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ఎడ్‌సెట్‌ కోకన్వీనర్‌ డాక్టర్‌ పారిపల్లి శంకర్‌ వెల్లడించారు. పరీక్ష సమయానికి ముందే ఆయా కేంద్రాలకు చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. పరీక్షకు నిర్దేశించిన సమయం కంటే నిమిషం ఆలస్యమైనా కేంద్రాల్లోకి అనుమతించబోమని స్పష్టం చేశారు.


కాగా, తెలంగాణలో ఎడ్‌సెట్ దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 19న ప్రారంభమైంది. కరోనా కారణంగా గడువును పొడిగిస్తూ వచ్చారు. కోవిడ్ తీవ్రత కాస్త తగ్గడంతో పరీక్షలను నిర్వహిస్తున్నారు.


పరీక్ష కేంద్రాల వివరాలివే.. 
హైదరాబాద్ సెంట్రల్, హైదరాబాద్ ఈస్ట్, హైదరాబాద్ వెస్ట్, హైదరాబాద్ నార్త్, హైదరాబాద్ సౌత్ ఈస్ట్, ఆదిలాబాద్, ఖమ్మం, సిద్దిపేట, పాల్వంచ, సత్తుపల్లి, నిజామాబాద్, కర్నూలు, నల్గొండ, కరీంనగర్‌, వరంగల్, విజయవాడ, కోదాడ, మహబూబ్‌నగర్, నర్సంపేట్ పరీక్ష కేంద్రాలుగా ఉన్నాయి. 


Also Read: JEE Main Admit Card 2021: జేఈఈ మెయిన్ 2021 అడ్మిట్ కార్డు ఇలా డౌన్లోడ్ చేసుకోండి.. కింద లింక్ ఉంది..
ఏపీ ఎడ్‌సెట్‌ ముఖ్యమైన తేదీలివే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎడ్‌సెట్ ) - 2021 నోటిఫికేషన్ విడుదలైంది. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ ఈ పరీక్షను నిర్వహిస్తోంది. దరఖాస్తు ప్రక్రియ జూలై 17న ప్రారంభం కాగా, ఆగస్టు 17వ తేదీతో ముగిసింది. అయితే ఆలస్య రుసుముతో ఆగస్టు 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే సదుపాయం ఉంది. ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ఎడ్‌సెట్ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కే.విశ్వేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీ ఎడ్‌సెట్ పరీక్ష సెప్టెంబరు 21వ తేదీన ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.


Read More: AP EdCET 2021: ఏపీ ఎడ్‌సెట్‌ నోటిఫికేషన్‌ విడుదల.. ముఖ్యమైన తేదీలివే..


Also Read: Grand Old 10th Class Student : ఆ 86 ఏళ్ల మాజీ సీఎం టెన్త్ పాసవుతారా? లేదా? నిన్నే ఇంగ్లిష్ పరీక్ష రాశారు...