JEE మెయిన్ 2021 నాలుగవ సెషన్ కు సంబంధించిన అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. ఈ అడ్మిట్ కార్డులు ఆగస్టు 21వ తేదీ నుంచి jeemain.nta.nic.in, nta.ac.in వెబ్ సైట్లలో అందుబాటులో ఉంటాయని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. పరీక్ష కోసం రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ ను నమోదు చేసి హాల్ టికెట్ ను నమోదు చేసి హాల్ టికెట్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
బీఈ, బీటెక్, బీఆర్క్ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్.. 2021 నాలుగో సెషన్ ఎగ్జామ్ ఆగస్టు 26, 27, 31, సెప్టెంబర్ 1, 2 తేదీల్లో జరగనుంది.
ఈ లింక్ తో డైరెక్ట్ వెబ్ సైట్ లోకి వెళ్లి డౌన్ లోడ్ చేసుకోవచ్చు
ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే...
- అభ్యర్థులు మొదటగా జేఈఈ మెయిన్ అధికారిక వెబ్ సైట్ కు వెళ్లాలి.
- Download JEE(Main) - 2021 (Session-4) Admit Card Paper (B.E./B.Tech./B.Arch/B.Plan) పేరుతో లింక్ కనిపిస్తుంది.
- అప్లికేషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, సెక్యూరిటీ పిన్ ఉపయోగించి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.
- స్క్రీన్ పై అడ్మిట్ కార్డు కనిపిస్తుంది
- డౌన్ లోడ్ చేసుకుని సేవ్ చేసుకుంటే సరిపోతుంది.
కరోనా కారణంగా ఉన్న నిబంధనలు కూడా అడ్మిట్ కార్డుపై ఉంటాయి. అడ్మిట్ కార్డుపై ఏమైనా తప్పులు ఉంటే 011-40759000 ఫోన్ నంబర్ ను లేదా jeemain@nta.ac.in ఈ మెయిల్ ను సంప్రందించాలి. అడ్మిట్ కార్డు లేకపోతే ఎగ్జామ్ హాల్ లోకి అనుమతించరు. అభ్యర్థులు అడ్మిట్ కార్డుతో పాటు ఆధార్ కార్డు, బాల్ పాయింట్ పెన్, పాస్ పోర్ట్ సైజ్ ఫొటో, హ్యాండ్ శానిటైజర్, వాటర్ బాటిల్ ను ఎగ్జామ్ హాల్ లోకి తీసుకోవచ్చు. ఫోన్లను లోపలికి అనుమతించరనే విషయం గుర్తుంచుకోవాలి.
Also Read: TS Inter Exams: సెప్టెంబర్‌లో తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు.. వారికి మాత్రమే..