జూమ్.. ప్రముఖ వీడియో-కాన్ఫరెన్సింగ్ యాప్ ఇది. ఆస్ట్రేలియాలో వినియోగదారులు జూమ్ యాప్ డౌన్ కావడంతో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను ప్రస్తుతం భారతీయ వినియోగదారులు కూడా ఎదుర్కొంటున్నారు. మీటింగ్ జరుగుతుంటే... మధ్యలో సమస్యలు వస్తున్నాయని చెబుతున్నారు యూజర్లు. కొంతమందికి అసలు జాయినింగ్ కూడా కావడం లేదని కంప్లైంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇండియన్ జూమ్ వినియోగదార్లు.. ఈ సమస్య గురించి ఫిర్యాదు చేస్తున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి భారత్ లో ఈ సమస్య తలెత్తింది. ఇప్పటి వరకు 600 మందికిపై వినియోగదారులు జూమ్ యాప్ సమస్యలపై కంప్లైంట్ చేశారు. అసలు డౌన్ అయిందా లేకుంటే.. పని చేయట్లైదా అని ప్రశ్నిస్తున్నారు.
అయితే... యూజర్లు సమస్యలపై డైరెక్ట్ గా జూమ్ యాప్ కి మాత్రమే కాకుండా ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ అయిన ట్విట్టర్ లోనూ పోస్టులు చేస్తున్నారు. చాలా మంది యూజర్లు ఒకే సమస్య గురించి ఫిర్యాదు చేస్తున్నారు.
ఒకవేళ మీరు మీ ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌లో ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటుంటే, సమస్య త్వరలో పరిష్కారమవుతుందని జూమ్ తెలిపింది. కొంత సమయం వేచి ఉండాలని రిక్వెస్ట్ చేసింది. యాప్ ను మళ్లీ ఇన్ స్టాల్ చేయోద్దని వెల్లడించింది. కనెక్షన్ సెట్ అయ్యేవరకు యాప్ పూర్తిగా లాక్ అయి ఉంటుందని జూమ్ పేర్కొంది.
జూమ్ యాప్ పై ఫిర్యాదు చేసిన వారిలో 48 శాతం మంది వినియోగదారులకు మీటింగ్ లో జాయినింగ్ సమస్యలు వచ్చాయి. 30 శాతం మంది వినియోగదారులు కాన్ఫరెన్స్‌ను ప్రారంభించలేకపోయారు. మిగతా 23 శాతం మంది యూజర్లు జూమ్ వెబ్‌సైట్‌లో వచ్చే సమస్యలపై ఫిర్యాదు చేస్తున్నారు.
అయితే ఈ సమస్య భారతదేశం, ఆస్ట్రేలియాలో మాత్రమే కాకుండా ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో ఉంది. ఒక వేళ అత్యవసర మీటింగ్స్ ఉంటే.. తాత్కాలికంగా గూగుల్ మీట్ లేదా మైక్రోసాఫ్ట్ టీమ్ ను ఉపయోగించుకోవచ్చు.
Also Read: Caste Based Census: ప్రధానితో బిహార్ నేతల భేటీ.. కులాలవారీగా జనగణనపై డిమాండ్