దేశ వ్యాప్తంగా సోమవారం సల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు, మంగళవారం(24 ఆగస్టు 2021)స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రధాన నగరాల్లో అంతగా ధరల్లో మార్పులేదు. తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. పలు జిల్లాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గగా, మరికొన్ని చోట్ల స్వల్పంగా పెరిగాయి. సోమవారం తెలుగు రాష్ట్రాలలో ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు కనిపించాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో మార్పుల వల్ల దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చు తగ్గులు వస్తున్నాయి.
తెలంగాణలోని పెట్రోల్, డీజిల్ ధరలు
తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. నిన్న ధరలు పెద్దగా వ్యత్యాసంలేదు. రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.69, లీటర్ డీజిల్ ధర రూ. 97.15గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.20 ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ.96.69గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.86గా ఉండగా, లీటర్ డీజిల్ ధర ధర రూ.97.30గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 105.77గా ఉండగా, డీజిల్ ధర రూ. 97.21గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.105.80గా ఉండగా డీజిల్ ధర రూ.97.26గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.69, డీజిల్ ధర రూ.97.15గా ఉంది.
ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు
విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.107.91, లీటర్ డీజిల్ ధర రూ.98.87 వద్ద ఉంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.106.87 ఉండగా డీజిల్ ధర రూ. 97.86 గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.69గా ఉండగా డీజిల్ ధర రూ.98.67గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 107.91, డీజిల్ రూ.98.87 వద్ద ఉంది. చిత్తూరు జిల్లాలో పెట్రోల ధర108.08, డీజిల్ ధర రూ.98.98 వద్ద ఉంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో
దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 101.64వద్ద ఉండగా, డీజిల్ ధర రూ. 89.07గా ఉంది. ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.66, లీటర్ డీజిల్ ధర రూ.96.64గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 99.32ఉండగా డీజిల్ ధర రూ.93.66లకు లభిస్తోంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.101.93, డీజిల్ ధర రూ. 92.13గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.105.13, డీజిల్ ధర రూ.94.49 గా ఉంది.