తెలంగాణలోని ఇంజినీరింగ్ కళాశాల్లో బీఈ/ బీటెక్‌/ బీఫార్మసీ కోర్సుల్లో రెండో సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించిన టీఎస్‌ఈసెట్-2023 ప్రవేశ పరీక్ష ఫలితాలు జూన్ 13న వెలువడనున్నాయి. తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి జూన్‌ 13న మధ్యాహ్నం 3.30 గంటలకు ఫలితాలను  విడుదల చేయనున్నారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచనున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో మే 20న జరిగిన ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 22వేల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. పాలిటెక్నిక్‌, బీఎస్సీ (మ్యాథ్స్) పూర్తిచేసిన విద్యార్థులకు ఈసెట్‌ ర్యాంకుల ఆధారంగా నేరుగా ప్రవేశాలు కల్పిస్తుంటారు.  


ఫలితాల కోసం వెబ్‌సైట్: https://ecet.tsche.ac.in/


Also Read:


ఏపీ ఈసెట్‌-2023 హాల్‌టికెట్లు విడుదల, డౌన్‌లోడ్ లింక్ ఇదే!
ఏపీలో బీఈ/ బీటెక్‌/ బీఫార్మసీ కోర్సు రెండో సంవత్సరంలో ప్రవేశాలకు ఉద్దేశించిన ఏపీఈసెట్-2023 పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను ఏపీ ఉన్నత విద్యామండలి జూన్ 12న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ఏడాది ఈసెట్ పరీక్ష నిర్వహణ బాధ్యతను జేఎన్‌టీయూ కాకినాడ చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్ 20న ఏపీఈసెట్-2023 ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. 
హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..


జూన్ 14న ఏపీ ఎడ్‌సెట్‌ పరీక్ష, వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో!
ఏపీలోని బీఈడీ, స్పెషల్‌ బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు 'ఏపీ ఎడ్‌సెట్‌-2023 పరీక్షను జూన్ 14న నిర్వహించనున్నట్లు ఏపీ ఎడ్‌సెట్‌ కన్వీనర్‌ ఆచార్య కె.రాజేంద్రప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 14న ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఎడ్‌సెట్ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను ఇప్పటికే విడుదల చేసిన సంగతి తెలిసిందే. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
హాల్‌టికెట్లు, పరీక్ష విధానం కోసం క్లిక్ చేయండి.. 


దేశంలోనే టాప్ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్​, యూనివర్సిటీల్లో 10వ స్థానంలో హెచ్‌సీయూ!
దేశంలోని అత్యుత్తమ విద్యాసంస్థల్లో గతేడాది మొదటి స్థానంలో నిలిచిన ఐఐటీ-మద్రాస్ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 2023 ర్యాంకుల్లో ఐఐటీ-మద్రాస్ తర్వాత రెండో స్థానంలో ఐఐఎస్సీ-బెంగళూరు నిలవగా, 3వ స్థానంలో ఐఐటీ-ఢిల్లీ నిలిచింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యాసంస్థల్లో ఐఐటీ-హైదరాబాద్ 14వ స్థానంలో నిలవగా, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 20వ స్థానంలో నిలిచింది. వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) 53వ స్థానంలో, ఉస్మానియా యూనివర్సిటీ 64వ స్థానంలో నిలిచింది. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ 76వ స్థానంలో నిలిచింది. ఐఐటీ మద్రాసు అగ్రస్థానంలో నిలవడం ఇది ఐదోసారి కావడం విశేషం.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


'జోసా' కౌన్సెలింగ్ షెడ్యూలు వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే!
దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే విద్యాసంస్థల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి నిర్దేశించిన జోసా(జాయింట్‌ సీట్‌ అలొకేషన్‌ అథారిటీ) షెడ్యూలు జూన్ 7న విడుదలైంది. జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు జూన్ 18న వెలువడనున్నాయి. ఫలితాలు విడుదలైన మరుసటిరోజు నుంచే అంటే.. జూన్ 19 నుంచి జోసా కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన విద్యార్థులకు జూన్ 4న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. జోసా రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 19 నుంచి 29 వరకు కొనసాగనుంది.
జోసా కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..