దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే విద్యాసంస్థల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి నిర్దేశించిన జోసా(జాయింట్‌ సీట్‌ అలొకేషన్‌ అథారిటీ) షెడ్యూలు జూన్ 7న విడుదలైంది. జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు జూన్ 18న వెలువడనున్నాయి. ఫలితాలు విడుదలైన మరుసటిరోజు నుంచే అంటే.. జూన్ 19 నుంచి జోసా కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన విద్యార్థులకు జూన్ 4న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. జోసా రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 19 నుంచి 29 వరకు కొనసాగనుంది.


సీట్ల కేటాయింపునకు సంబంధించి జూన్ 26 వరకు అభ్యర్థులకు మాక్‌ కౌన్సెలింగ్‌ అందుబాటులో ఉంటుందని.. దానివల్ల తమ ర్యాంకు ఆధారంగా ఎక్కడ సీటు వస్తుందో తెలుసుకునే అవకాశం ఉంటుంది. జూన్ 30 నుంచి అసలు ప్రక్రియ ప్రారంభంకానుంది. మొత్తం 6 రౌండ్ల కౌన్సెలింగ్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.


ప్రకటించిన షెడ్యూలు ప్రకారం 6 రౌండ్ల కౌన్సెలింగ్ తర్వాత ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, ఇతర సంస్థల్లో సీట్లు ఖాళీగా ఉంటే జులై 26 నుంచి 31 వరకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. సీట్లు పొందిన జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు రూ.40,000; ఇతరులు రూ.20,000 చెల్లించాల్సి ఉంటుంది. ఈసారి మొత్తం 114 విద్యాసంస్థలు కౌన్సెలింగ్‌లో పాల్గొననున్నాయి. అందులో 23 ఐఐటీలు, 32 ఎన్‌ఐటీలు, 26 ట్రిపుల్‌ఐటీలు, మరో 38 కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి.


JoSAA Counselling ఇలా..


♦ 1వ రౌండ్‌ : జూన్ 30 నుంచి జులై 5 వరకు


♦ 2వ రౌండ్‌: జులై 6 నుంచి జులై 11 వరకు


♦ 3వ రౌండ్‌: జులై 12 నుంచి జులై 15 వరకు


♦ 4వ రౌండ్‌: జులై 16 నుంచి జులై 20 వరకు


♦ 5వ రౌండ్‌: జులై 21 నుంచి జులై 25 వరకు


♦ 6వ రౌండ్‌ (చివరి): జులై 26 నుంచి  జులై 28 వరకు నిర్వహిస్తారు. 
 
6 రౌండ్ల సీట్ల కేటాయింపు తేదీలు ఇవే:


♦ 1వ రౌండ్‌ సీట్ల కేటాయింపు: జూన్ 30న


♦ 2వ రౌండ్‌: జులై 6న


♦ 3వ రౌండ్‌: జులై 12న


♦ 4వ రౌండ్‌: జులై 16న


♦ 5వ రౌండ్‌: జులై 21న


♦ 6వ రౌండ్‌ (చివరి): జులై 26న


జోసా 2023-కౌన్సెలింగ్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..



Also Read:


జీఆర్‌ఈ ఇకపై రెండు గంటలే, సిలబస్‌లోనూ పలు మార్పులు!
విదేశాల్లో ఉన్నతవిద్య కోసం నిర్వహించే జీఆర్‌ఈ పరీక్షకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు ఇది నిజంగా గుడ్ న్యూస్. ఈ ఏడాది నుంచి జీఆర్‌ఈ (గ్రాడ్యుయేట్‌ రికార్డ్‌ ఎగ్జామినేషన్‌) పరీక్షలో పలు సంస్కరణలకు ఈటీఎస్(ఎడ్యుకేషనల్‌ టెస్టింగ్‌ సర్వీస్‌) శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు దాదాపు నాలుగు గంటల పాటు జరిగే జీఆర్‌ఈ పరీక్షను ఇప్పుడు రెండు గంటలకు కుదించారు. పరీక్ష ఫలితాలు కూడా కేవలం 10 రోజుల్లోనే వెల్లడించనున్నారు. ఇన్నాళ్లూ జీఆర్‌ఈ పరీక్ష మూడు గంటల 45 నిమిషాల పాటు జరిగేది. ఫలితాన్ని 15 రోజుల్లోపు ప్రకటించేవారు. కానీ, తాజాగా చేసిన మార్పులతో పరీక్ష సమయం ఒక గంట 58 నిమిషాలకు తగ్గింది. ఫలితాన్ని కూడా పది రోజుల్లోపే ప్రకటిస్తారు. వచ్చే సెప్టెంబరు నుంచి ఈ విధానం అమలు కానుంది. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


దేశంలోనే టాప్ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్​, యూనివర్సిటీల్లో 10వ స్థానంలో హెచ్‌సీయూ!
దేశంలోని అత్యుత్తమ విద్యాసంస్థల్లో గతేడాది మొదటి స్థానంలో నిలిచిన ఐఐటీ-మద్రాస్ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 2023 ర్యాంకుల్లో ఐఐటీ-మద్రాస్ తర్వాత రెండో స్థానంలో ఐఐఎస్సీ-బెంగళూరు నిలవగా, 3వ స్థానంలో ఐఐటీ-ఢిల్లీ నిలిచింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యాసంస్థల్లో ఐఐటీ-హైదరాబాద్ 14వ స్థానంలో నిలవగా, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 20వ స్థానంలో నిలిచింది. వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) 53వ స్థానంలో, ఉస్మానియా యూనివర్సిటీ 64వ స్థానంలో నిలిచింది. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ 76వ స్థానంలో నిలిచింది. ఐఐటీ మద్రాసు అగ్రస్థానంలో నిలవడం ఇది ఐదోసారి కావడం విశేషం.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..