Stock Market Today, 13 June 2023: ఇవాళ (మంగళవారం) ఉదయం 7.45 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX Nifty Futures) 57 పాయింట్లు లేదా 0.30 శాతం గ్రీన్‌ కలర్‌లో 18,755 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ గ్యాప్‌ అప్‌లో ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి: 


ZEE ఎంటర్‌టైన్‌మెంట్: ఎస్సెల్ గ్రూప్ చైర్మన్ సుభాష్ చంద్ర గోయెంక, జీ ఎంటర్‌టైన్‌మెంట్ హెడ్ పునీత్ గోయెంక 1 సంవత్సరం పాటు మేనేజ్‌మెంట్‌లో ఎటువంటి కీలక పదవులు నిర్వహించకుండా సెబీ నిషేధించింది.


గో ఫ్యాషన్‌: సీఖోయా క్యాపిటల్‌, సోమవారం, బల్క్ డీల్స్ ద్వారా గో ఫ్యాషన్‌లో (ఇండియా) తన మొత్తం 10.18% వాటాను విక్రయించింది. రెండు దేశీయ సంస్థాగత పెట్టుబడి సంస్థలు BNP పారిబాస్ ఆర్బిట్రేజ్, ICICI ప్రూ లైఫ్ ఇన్సూరర్, రెండు విదేశీ పెట్టుబడి సంస్థలు సొసైటీ జనరల్, కువైట్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ ఫండ్‌ ఓపెన్‌ మార్కెట్ ద్వారా షేర్లను కొన్నాయి.


పంజాబ్ & సింధ్ బ్యాంక్: 12 నెలల వ్యవధిలో, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ విడతల్లో బాండ్ల జారీ ద్వారా రూ. 750 కోట్ల వరకు సమీకరించడానికి బ్యాంక్ డైరెక్టర్ల బోర్డ్ ఆమోదించింది.


ఇంజినీర్స్ ఇండియా: 40 నెలల ప్రాజెక్ట్ షెడ్యూల్‌తో సుమారు రూ. 472 కోట్ల విలువైన ఆర్డర్‌ను ONGC నుంచి ఇంజినీర్స్ ఇండియా దక్కించుకుంది.


JSW స్టీల్: గోవాలో ఇనుప ఖనిజం మైనింగ్ లీజు మంజూరులో, JSW స్టీల్‌ను గోవా రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ  ప్రాధాన్య బిడ్డర్‌గా ప్రకటించింది. 


గ్రీవ్స్ కాటన్: తమ కంపెనీ ఎలక్ట్రిక్ త్రీ వీలర్‌లు కొనేవాళ్ల కోసం ఆకర్షణీయ రుణ ఫైనాన్సింగ్ ఆప్షన్‌లు అందించడానికి బైక్ బజార్ ఫైనాన్స్‌తో గ్రీవ్స్ కాటన్ అనుబంధ సంస్థ గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఒప్పందం కుదుర్చుకుంది.


HFCL: దిల్లీ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఫేజ్ IVలో, మూడు ప్రయారిటీ కారిడార్‌ల కోసం ఫైబర్ ఆప్టిక్స్ ట్రాన్స్‌మిషన్ సిస్టమ్‌ (FOTS) డిజైన్, తయారీ, సరఫరా, ఇన్‌స్టాలేషన్, టెస్టింగ్, ప్రారంభం కోసం దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) నుంచి రూ. 80.92 కోట్ల విలువైన ఆర్డర్‌ను HFCL పొందింది.


కాప్లిన్ పాయింట్: cisatracurium besylate ఇంజెక్షన్‌ను అమెరికాలో మార్కెట్‌ చేయడానికి USFDA నుంచి ఈ కంపెనీకి ఆమోదం లభించింది.


టాటా మోటార్స్‌: టాటా మోటార్స్ యాజమాన్యంలోని జాగ్వార్ ల్యాండ్ రోవర్ 3 బిలియన్ పౌండ్ల వార్షిక పెట్టుబడిని ప్లాన్ చేస్తోంది. FY26 నాటికి 30 బిలియన్ పౌండ్ల ఆదాయాన్ని టార్గెట్‌గా పెట్టుకుంది.


ఐనాక్స్ విండ్ ఎనర్జీ: మాతృ సంస్థ ఐనాక్స్ విండ్‌తో విలీనానికి ఐనాక్స్ విండ్ ఎనర్జీ డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలిపింది. ఈ స్కీమ్‌ కింద, ఐనాక్స్ విండ్ ఎనర్జీలో ఉన్న ప్రతి 10 షేర్లకు ఐనాక్స్ విండ్‌ నుంచి 158 ఈక్విటీ షేర్లను కేటాయిస్తారు.


ఇది కూడా చదవండి: గుడ్‌న్యూస్‌! 4.25 శాతానికి దిగొచ్చిన రిటైల్‌ ఇన్‌ఫ్లేషన్‌! 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.